Pages

Sunday, January 18, 2009


పశువుల కొట్టంలో కట్ట బడిన కర్రిఆవు బిడ్డ నోటి నుంచి పొడుగు వేరు చేయాలని బిడ్డని బ్రతిమాలుతోంది."కొంచెం పాలు కృష్ణుడికి ఇయ్యాలమ్మా!కాస్త ఉంచమ్మ అన్నీ నీకే ఇస్తే కన్నయ్య ఏమంటాడు?నీకంతా స్వార్ధం నీబిద్దడే నీకు గొప్పా? అంటాడు.మళ్ళి మళ్ళి కన్నయ్యకి నాపాలు ఇచ్చుకోగాలనా?ఈజన్మలో నందుని వాకిట్లో వున్నాను కనుక నాకీ అదృష్టం పట్టింది.నా జన్మ చరితార్ధం చేసుకొనీ తల్లీ!కాసినిపాలు కన్నయ్యకియ్యనియ్యమ్మా!అని బతిమాలి పక్కకు జరిగి అంబా!అంబా! అంటూంది.యశోదమ్మా!రామ్మా!నా పాలు సిద్ధంగా వున్నాయి .నేనిట కంటే కన్నయ్య కేమి ఇవ్వగలను?అన్నట్లున్నడా పిలుపు.శివుడు భిక్షాపాత్ర పుచ్చుకొన్నాడు కానీ బిక్షకుడుకాడు.


శివుని కంటే మహా ఐశ్వర్య వంతులు ఎవరూ లేరు.ఎమానవుడైనా ఈజన్మలో రవంత ధనాన్ని అనుభవిస్తున్నాడంటే ,సుఖిస్తున్నాడంటేక్రితం జన్మలో శివ భక్తుడై శివ పూజ చేసి వుంటాడు.అంటారు.ఆశివుడు ఈరోజు యాచకుడై,నందుని వాకిట నిలువబడి వున్నాడు.ఆ మహేశ్వరుని చూచిన వారు ఆయన ముక్కంటి వలె వున్నాడని ,మహా తేజస్సుతో వెలిగి పోతున్నాడని ఒకరితో ఒకరు ముచ్చటించుకొన్నారు. పవిత్రమైన,నిజమైన తేజస్సును ఎవరు దాచ గలరు?పార్వతీ పాటికి కూడా చేతకాలేదు.


వాకిట్లో నిలబడిన బిక్షువును చూచి పళ్ళెం నిండా పళ్ళు,పలహారాలూ సర్ది దాసిచేతికిచ్చి పంపిందియశోడ.


యశోదా దేవి మీకియ్యమని పంపారు.వీటిని స్వీకరించి బిడ్డని ఆశీర్వదించమని కోరింది. అంది దాసీ. నేను భిక్ష తీసుకొను. నాకు దేనిమీదా ఆశ లేదు.నేను కేవలం బాల కృష్ణుడిని చూడాలని వచ్చాను."అన్నాడు శివుడు.


దాసీ లోపలికి వెళ్లి యశోదతో చెప్పింది."ఆయనకీ ఇవేమీ అక్కర లేదటమ్మా! బాల కృష్ణుడిని చూడటానికి మాత్రమె వచ్చాడట. "అంది.సాధువులని పరిశీలించాలి అంటే వాళ్ల వేషమూ జాతి, ప్రాంతమూ కాదు ముఖ్యం. వాళ్ల కళ్ళలోని పరిభాష,నడవడిక తోనేగుర్తించవచ్చు.

No comments: