Pages

Sunday, February 8, 2009

వానలో గుమ్మడి ఒడియాలు

వానలో గుమ్మడి ఒడియాలు _౩
వంట చేస్తున్నానన్న మాటే గానీ గుమ్మడికాయ ముక్కలు తోరణాల్లా నా కళ్ళ ఎదుట వ్రేలాడుతున్నాయి.పని అమ్మాయి "అప్పటికిఅంది,ఆ అప్పటికి ఎప్పటికో"అని చింత.పాపం మాట ప్రకారం వచ్చింది.ముక్కలనందించి ,అది పెద్దగా తరిగితే వాటిని మల్లి చిన్నముక్కలు చేసి పూర్తీ చేసే సరికి మణికట్టు,జబ్బలు,చేతి వేళ్ళు ఒకటే నొప్పి."నేను రాకపోతే నీవల్ల అయేదికాదు గంద"అంది.నిజమే!.ఇంగువ తెప్పించి "చిల్లర వుంచుకో"అన్నా.నాకొక చిరునవ్వు ప్రెజెంట్ చేసి వెళ్లి పోయింది.ఒక అరకిలో పచ్చి మిరపకాయలు తెచ్చిపెట్టవేఅన్నామ్మాయితో."ఎందుకె అమ్మా?మిర్చిభాత్ చేస్తావా?అంది.
కాదు,మీఆయనకి వడియాలు కారంగా వర్రగా వుండాలికదా.ఈవడియాలలో ఎండుకారం వేస్తె రాళ్ళలా బిగుసుకుపోతాయి.వెళ్లి తెచ్చింది.మిర్చిపిండిలో కలిపెసరికి వేళ్ళు మండిపోయాయి.పచ్చి వడియాలు వడ్డిన్చగానే అల్లుడి మొఖం విప్పారి తిన్నాడు.కష్టమంతా గాలికి ఎగిరిపోయింది.ముక్కలన్నీ అరడజను పళ్ళాలలో పెట్టి డైనింగ్ తబిల్ మీదపెట్టి ఫాన్ వేసాను ఆరడానికి.అల్లుడు అటు వెడుతూ వాటి వంక ఆప్యాయమ్గా చూసుకొంటున్నాడు.రాత్రికి మళ్ళి
వదియాలే!ఇంకా ఇన్ని ముక్కలు మిగిలాయి.సీతకి ఫోన్ చేసి"బూడిద గుమ్మదికాయ్ వడియాలు తింటారా?అన్నా.ఆహా!అందిసీత.పచ్చి వడియాలు-అబ్బ అవయితే మరీ ఇష్టం ఈకాలం వడియాలెవరు పెడతారు!"నేనే "ఏం కష్ట పడతావులే! వద్దు."పడ్డానే!చాలామిగిలాయి,నువ్వు తిన్టానంటే పంపిస్తా"మీరు తినందే""మేముతిన్నములేవోయ్"అని గిన్నెలో సర్ది పంపించా."పచ్చి వడియాలుతిని!నాలుగు ఎల్లయిందే!అందరికి ఫీట్ అయాయి.{అంటే అందరికి నచ్చాయి అని అర్ధం వాళ్ల భాషలో}అంతా అల్లుడిదయ అన్నాను. ఇంకా నాలుగు పళ్ళాలలో వున్నాయిముక్కలు.మర్నాడు పొద్దున్న "అల్లుడు ఏమి టిఫిన్ తింటాడో అడగవే అంటే ,అల్లుడు పేపర్లోంచి తల బయటికి పెట్టి "వడియాలుంటే టిఫిన్ ఎందుకు?పదిన్నరకి అన్నం తిని వెడతా అన్నాడు.కొంచెం వాన తగ్గింది కాని గాలి చల్లగావుంది.ఫాను నిర్విరామం గా తిరిగి వడియాలు ఆరబెట్టటానికి కృషి చేస్తున్నది.ఇక విసుగోస్తున్నది.నాకొక అయిడియా వచ్చింది.ముక్కలు కాస్త తడి ఆరాయి.వీటిని మిక్సీలో వేసి పొడిచేసి బీరపోట్టులాగా డీప్ ఫ్రై చేస్తే ఎలావుంటుంది.అలాగే చేసి వడ్డించా.మావారు వీలైనత వికృతంగా మొఖం పెట్టి"ఇదుగో!ఈచెత్త నీకిష్ట మైతే నువ్వు తిను కానీ నాకు వెయ్యకు అన్నారు.చెత్త ఏమిటండీ !తినేవస్తువుల్ని చెత్త అనకూడదు.పాపం ఆటను దూరం నుంచి మోసుకొచ్చాడు అన్నా."ఆయనకిష్టం గనుక మోసుకొచ్చారు"అంది మా అమ్మాయి.
నిజానికి ఈపోది వేడివేడి అన్నం లోకి బాగుంది."రండి-వండి వార్చండి"అనే ప్రోగ్రాంలో చెపుతే అందరూ చేసుకొంటారు.అసలు ఎండాకాలంలో గుమ్మడి ముక్కలు ఇలా పొడిచేసి నిలవ వుంచుకొంటే చలికాలంలో వేయించుకు తినొచ్చు.
అల్లుడు వూరునుంచి రాగానే "రాత్రికే ప్రయాణం. ఇంకా డజను పనులున్నాయి.అన్నట్లు మా అమ్మ గుమ్మడికాయ పొడి వేయించి పెట్టిందిమీకోసమంది. "ఏమిటీ గుమ్మడి పోడా?ఏదీ పట్రా అని చిటికెడు నోట్లో వేసుకొని" ఇది నా బాగ్ లో పెట్టు ,ఫ్లైట్ లో కాలక్షేపానికి తింటా.ఆపనులేవో చెప్పు నేగాబగాబా చేసుకు వస్తా.అని చెప్పులేసుకు బయల్దేరాడు.మా అమ్మాయి నావంక చూసి నవ్వింది. గుమ్మడికాయ సొమ్ము చేసినందుకు, అల్లుడి చేత గౌరవింప బడ్డందుకు చెప్పలేని తృప్తి కలిగింది.

1 comment:

మురళి said...

బాగున్నాయండి మీ గుమ్మడి వడియాలు. నాక్కూడా పచ్చి వడియాలే ఇష్టం. గోదావరి వాడిని మరి :)