ఉత్క్రుష్టపు జీవితాలు
ఉద్ధరించే ఉపాయాలు
"ఏమిటో జ్ఞానా ఈమధ్య జీవితం మరీ ఉత్కుష్ట మైపోతూంది "
అంది అచ్యుతం .ఏమి ఏమైయిందేమిటి?అన్నా.నిన్న ఆదివారం అనుకోకుండా ఆపద వచ్చి పడింది.చుట్టలోచ్చారా? బియ్యంనిండుకొన్నాయా?అబ్బే అదేంకాదు,మామరిది సినిమా టికెట్ కొన్నాడటతనకి స్నేహితుడికి తీరా ఆ అబ్బాయికి రావడానికి వీలు లేకపోయిందిట.పోనీ ఇంకేవరినయినా తీసుకు పోవచ్చా!అన్నయ్యా వస్తావా?టికెట్ వూరికేపోతుంది,అన్నాడు అంతే"ఏమేవ్! రొట్టి చెయ్యి త్వరగా సినిమాటైమవుతూంది "అని ఓ పొలికేక వేసారు.వంట కాలేదేమిటి?వంటకేమి భాగ్యం తల్లి! ఆరునూరైనా సరే ఆయన అడిగే సరికి అత్తెసరు,ఆధరువులు రెడీ గా లేకపోతె ఆక్షణంలో చెల్లు చీటీ వ్రాస్తారుగా!నీకు తెలియనిదేముంది? రొట్టెలు చేద్దామంటే సమయానికి
అప్పడాలకర్ర కనపడలేదు.డబ్బాల వెనక గాస్ స్టౌ కింద ,సిలేన్దర్ పక్కన
అంతా వెతికా!ఎక్కడ పోయిందబ్బా!అని బుర్ర బద్దలుకోట్టుకొన్నా!డిష్ వాషర్ శబ్దానికి జ్ఞానోదయమయింది.ఓహో!మాతోటికోడలు అప్పడాల కర్రని డిష్ వాషర్లోపడేసి వుండాలి,లేకపోతె రోజు మొద్దులా ఎదురుగా పది వుండేది ఇవాళ ఏమయిపోతుంది? ఈరోజుల్లో మనుషులకి ఎంత బద్ధకాలనుకోన్నావుజ్ఞానా !కత్తులు,కత్తెరలు,కూడా డిష్ వాషర్ లో పడేస్తున్నారు.ఏమన్నా అంటె!ఆ!అవన్నీ ఎవరు కడుగుతూ కూర్చుంటారు,విసుగు అని సమాధానం.మరేమిచేసావు?ఏమిచేస్తాను? అప్పటికే మీ బావగారు అప్పులవాడిలా ఆరుసార్లు వంటింట్లోకి సావిట్లోకి
తిరిగారు,ఇక అస్టోత్తరమె తరువాయి.ఎలాగో అలా రొట్టి చేయాలి.చెంబు విస్త్రీ చేసినట్టు బట్టపరచి రొట్టె పిండి వుండ దానిమీద పెట్టి పైన మళ్ళి తడిబట్ట వేసి మంచి నీళ్ళ చెంబుతో నొక్కితే రొట్టి సాగలేదు.అప్పుడు చెంబు పడుకో బెట్టి అప్పడాలకర్రలా ఉపయోగించా!రొట్టె సాగింది.కాకపొతే మాటిమాటికి పొడి పిండి వెయ్యాలి.ఉపాయం బాగా పని చేసింది జ్ఞానా !తిట్లు తినకుండా నా రొట్టి విరిగి నేతిలో పడింది.నువ్వుకూడా ప్రయత్నించి చూడు.వెధవ అప్పడాల కర్ర లేకపోతె ఏమాయే! ఇంతకీ అప్పడాలకర్ర దొరికిందా? డిష్ వాషర్ లోనే కూర్చుంది.అందుకే నాకు డిష్ వాషర్ అంటె
ఒళ్ళు మంట .అది నిండే దాకా ఆన్ చెయ్యలేము.చేసాక ఘంటలువదిలేయ్యాలి.హాయిగా ఎప్పటికప్పుడు కడిగి అవతలపారేస్తే బాధ వదిలిపోతుందిజ్ఞానా!ఇవ్వాళా మా తోటి కోడలికి ఘట్టిగా చెప్పా,నాకు చెప్పకుండా నువ్వు కనిపించినవన్ని అందులో పారేసి ఆన్ చెయ్యకుఅని.
భగవంతుడు ఈబుర్రకి కాసిని ఉపాయాలు అందించాడుకాని లేకపోతె ఈ ఉత్క్రుష్టపు బతుకు ద్ధరించుకోలేక చచ్చే వాళ్ళం జ్ఞానా!ఇంతకీ ! ఏమిటంటావు జ్ఞానా!డిష్ వాషర్లో కత్తులు,అప్పడాలకర్రలు వెయ్యోచ్చా !
అంది అచ్యుతం .
2 comments:
ఆనందం, పరమానందం మాతా. మా ఇంట్లో జరిగే నిత్య తంతు, ఇక్కడ రాతలో చూసుకున్నా
naa paru sirisha me joke lanti idea super next time alanti scene vaste vupayoginchukuntanu
Post a Comment