Pages

Friday, November 13, 2009

జివేన శరద: శతం

జీవేన శరద:శ్శతం
వంద ఏళ్ళు ఆరొగ్యంగా జీవించాలి. ఈకోరిక ప్రతి మానవుడికి వుంటుంది. విటమిన్ "సీ " లో
మహత్తర మైన శక్తులున్నాయని శరీరానికి కావలసిన ఆరోగ్యాన్నిచ్చి ,యౌవనాన్ని వృధ్ధి చేసి రోగాలను నివారిస్తుందని వైద్య శాస్త్రం చెపుతుంది.ఈవిషయాన్ని వేయి సంవత్సరాల క్రితం భారత దేశపు వైద్యులు పరిశోధన చేసి నిర్ణయించారు.ఆరోగ్య రక్షణ కోసం వారు ఎన్నో మందులు,చికిత్సలు ,లేహ్యాలు కనిపెట్టారు.అందులో చ్యవన ప్రాశ ఒకటి. చ్యవన ప్రాశ ప్రాశస్త్యం తెలిసినా తెలియక పోయినా అది తినడం వలన శరీరంలో ఉష్ణత నిలకడగా
వుంటుందని, జలుబులు దగ్గులు రావని నమ్ముతారు.ఇది తియ్యగా వుండటం వలన పిల్లలు మారాం చేయకుండా తింటారు.మనం ఒకచెంచా పెడితే వాళ్ళు ఇంకో చెంచా తింటారు.
చ్యవన ప్రాశకు సంబంధించి ఒక కథ కూడావుంది.చ్యవన మహర్షి పేరుతో ఈ లేహ్యం పుట్టిందిట.వృధ్ధు డైన చ్యవన మహర్షి ఒక వనం లో తపస్సు చేసుకొంటున్నాడట. చాలా సంవత్శరాలు ఒకేచోట కూర్చోవడం వల్ల ఆయన చుట్టు చెదలు పుట్టలు పెట్టాయి.శరీరం అంతా నిడి కళ్ళు మాత్రం కనిపించేవిట .సుకన్య అనే రాజకుమారి ఆవనానికి చెలికత్తెలతో వాహ్యాళికి వెళ్ళిందిట.ఈపుట్ట చూసింది. కళ్ళు మాత్రం మెరుస్తున్నాయిట.సుకన్య కుతూహలం తో ఆకళ్ళల్లో పొడిచింది.ఆయన కు కళ్ళు పోయాయి.సుకన్య చాలా పశ్చాత్తప పడి ఆఋషిని పెళ్ళీ చేసుకొంది.దేవతల వైద్యులు అశ్వని కుమారులను ప్రార్ధించింది,తన భర్తకు చూపు తెప్పించమని.వారు ఔషధం తయారు చేసి ఇచ్చారు.ఆయనకి చూపు రావడమే కాక పున: యౌవనం కూడా వచ్చిందిట.ప్రాశ అంటే తినడం చ్యవనుడు తిన్న ఔషధ కనుక దినికి చ్యవన ప్రాశ అని పేరు వచ్చింది.
అంటె ఇఔషఢానికి ఇంత శక్తి వుంది.ఇంతలాభం జరుగుతుందా?ఇప్పటికి? అని శంసయం రావచ్చు.
ఔషధాలు,ఉపకరణాలు పెట్టి రోగిని ఒక గదిలో నిర్ణీత కాలం పెట్టేవారుట.బయట ప్రపంచం తో రోగికి సంబంధం వుందేది కాదుట.అప్పుడు చ్యవన ప్రాశ పెట్టే వారుట.
అప్పుడు కాయాకల్పం జరిగేదిట.పండిత మదన మోహన మాలవ్యా గారు కూడా కొంతకాలం ఈచికిత్స పొందారట.ఇది పూర్తిగా ఫలితాన్నియ్యాలంటే దీన్ని తాజాగా సేవించాలి..తయారు చేసాక ఒక సంవస్తరం దాటగానే ఇందులో వేసిన పదార్ధాల శాక్తి తగ్గు ముఖం పడుతుందంటారు.పూర్వ వాళ్ళు ఈఔషధ ఇలా తయారు చేసి అలా రోగికి ఇచ్చేవారుట.
చ్యవనప్రాశ తయారు చేయడానికికాలము,శ్రమ ఎక్కువ వినియోగించాలి.ఔష్ధీయుక్త మైన వేర్లు,ఆకులు కొమ్మలు అడవులలో తిరిగి వెతికివెతికి తేవాల్సి వుంటుంది.పదిమంది పది దిక్కులకు పోయినాకూడా సమయం బాగానేపడుతుంది.చరక సమ్హిత మొదలైన ఆయుర్వేద గ్రంధాలలో చ్యవన ప్రాశ తయారీ,దాని ప్రాశస్త్యము వివరించారు.దీనిని శీతాకాలం లో సేవించడం చాలా మంచిది. దీనిని తయారు చేయడం కూడా శీతాకాలం లోనే చేస్తారుట.
పక్వానికి వచ్చిన్ తాజాగా పండిన ఉసిరికాయలు,వేర్లు,ఆకులు తెచ్చి కళాయిపెట్టిన పాత్రలో నీళ్ళు పోసి ఉడికిస్తారు.శీతాకాలం లో ఉసిరికాయలు పుష్కలం గాదొరుకుతాయి వాటిలో విటమిన్ "సి" పుష్కలం గావుంటుంది.గులాబి,బిల్వపత్రం,పగడ చెట్టు ఆకులు,విష్ణు క్రాంత ఆకులు,రావీఅకు,ఎండ్రగబ్బ కొమ్మ ఆకు,మునక్కయ ,కరక్కాయ,జీవంతి,నేల ఉసిరి,కజ్జూరం,తామరదుంప,చందనం,ఆకుపచ్చ ఏలకులు,సొంటి అష్టవర్గ మొదలైనవి దీనిలో వేస్తారు.అందుకే చ్యవన ప్రాశ సీసాల పై విశేష అష్ట వర్గలతో చేసింది అని వ్రాస్తారు.తమ్మి వేరు,కాకి దొండ చెట్టు,వ్రుధ్ధ మెదా,మహామదా,రుషభుక్,జీవక కాకోలీ,క్షీరకాకోలి ఈఎనిమిది ని అష్టవర్గ అంటారు.
ఇవి దుర్గమ మైన హిమాలయ పర్వతాలలో మంచు ప్రదేశం లో పుడతాయి.సన్నని సెగ మీద నెయ్యి కాచి ఇవన్ని అందులొ వేసి ఎర్రగా వేగనిస్తారు.పూర్తిగా వేగాక నెయ్యి పైకి వస్తుంది.వెరే నీళ్ళు బాణలిలో వేసిపొంగాక పంచదార వేసి పాకం పడ్తారు.ఇందులొ వేగించిన దినుసులు వేసి హల్వాలా చేస్తారు.పిప్పలి,నాగ కేసరి,తేజపత్తా,ఏలకులు,వంశలోచన్,దాల్చీని,మెత్తగా నూరి ఇందులో కలుపుతారు.చల్లబడ్డాక సీసాలలో నింపుతారు.
ఉదయం ఫలహారం చేసేముందు పాలతోకానీ,వేడినీటితో కాని 20 గ్రాములు పుచ్చుకోవాలి.రాత్రి ఇలాగేసేవించాలి.ఇది శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది.ఇది శ్రేష్ట మైన రసాయనం. వూపిరితిత్తులకి,మస్తిష్కానికిశక్తినిస్తుంది.గుండెలోని ధమనులని,నాడులని బలపరుస్తుంది.విద్యార్ధులకి,బుధ్ధిజీవులకి శ్మరణ శాక్తిని పెంచుతుంది.పేగులలో మలం చేరితే వచ్చే రోగాలని నిరోధిస్తుంది.నియమంగా పుచ్చుకొంటే రక్త వౄధ్ధి,శరీరంలో కాంతి కల్గుతాయి.ఇందులో వుండే వంశలోచన అంటే ప్రక్రుతి సిధ్ధమైన "క్యాలిషం "వలన ఎముకలు గట్టిపడతాయి.కాని అన్ని మంచి గుణాలే అని అందరు సెవించకూడదు.వాయుపీడితులు,విరోచనాలయ్యె వాళ్ళు,ఆకలి లేనివాళ్ళు,అజీర్ణం తో బాధ పడే వాళ్ళు పుచ్చుకోకూడదు.ఎదిగేపిల్లలకి ఇది ఎంతో మంచిది.ఇది సహజ మైన,సులభ మైన దివ్యౌధం.శీతాకాలం లో జలుబులు,దగ్గులు,జ్వరాలు రానియ్యదు.తియ్యగా వుండటం వల్ల పిల్లలు తినడానికి ఇష్ట పడతారు.
స్వాగత్ సౌజన్యంతో

No comments: