Pages

Tuesday, November 24, 2009

ఈ పని ముఖ్యం

ఈ పని ముఖ్యం
నాగరిక ప్రబలిన తరువాత వూరు మారడం ,దేశం మారడం
తప్పనిసరి అయింది. సొంత ఇల్లు అంటు లేకపోతె వున్నా ఊళ్లోనే
ఇల్లు మారాల్సి వస్తూ వుంటుంది. ఇల్లు మారడం ఒక పెద్ద తతంగం .
ఇల్లు మారేటప్పుడు చెంచా మర్చిపోయామేమో! చీపురుకట్ట పెట్టామో లేదో? పాత పేపర్ల కట్ట వరండాలోనే వదిలేసామేమో? అనిఖంగారుపడి మళ్ళిమళ్ళి పదిసార్లు చూసుకుంటాము.
ఇల్లు మారగానే పోస్టల్ వారికి మాత్రం కొత్త అడ్రెసు తెలియపరచం. బధ్ధకిస్తాము. ఇదివరకు పోస్ట్లో క్షేమ సమాచారాల ఉత్తరాలే వచ్చేవి. ఇప్పుడు పోస్ట్ ద్వారా ఎన్నో లావాదేవీలు నడుస్తువుంటాయి. చెక్కులు వస్తాయి, సర్టిఫికెట్లు వస్తాయి, ఉద్యోగాలకి ఆర్డర్లు వస్తాయి. ఇవి అన్ని అడ్రెస్ కొత్తది చెప్పక పొతే ఎటో పోతాయి.
పోస్టలు వారికి కొత్త అడ్రెస్ ముందుగానే తెలియపర్చడం ముఖ్యం.కాకపొతే మనం చెప్పినా పాత అడ్రెస్ కి కొన్నాళ్ళు ఉత్తరాలు వస్తాయి. పక్కనున్న వారికో ,ఇంటి యజమానికో "మాఉత్తరాలు జాగ్రత్త పెట్టండి,మేము వచ్చి తీసుకు వెళ్తాము ,అని చెప్పాలి. కొందరు ఎదుటివారి ఉత్తరాల్ని మహా నిర్లక్ష్యం గా చూస్తారు, ఇల్లు ఖాలిచేసారుగా ఇక వాళ్ళతో మనకేమిటి అనుకొంటారేమో? వాటిని ఏమూలో పడేస్తారు.
మొన్న మాకు తెలిసిన వాళ్ళు ఇల్లు ఖాళి చేసి వస్తూ పక్కనున్నవాళ్ళకి "మాపోస్ట్ జాగ్రత్త పెట్టండి" అని చెప్పి వచ్చారుట.
ఏదో ఉత్తరం వచ్చింది,ఇంటాయన తమ్ముడు "దాన్ని రిటర్న్ చేసేసాడు.
తీరా ఆరా తీస్తే అదిఒ కంపని నుంచి వచ్చింది, అందులో చెక్కు వుంది.
వీళ్ళు మళ్ళి ఆ కంపెనీకి ఉత్తరాల మీద ఉత్తరాలు వ్రాస్తున్నారు వాళ్లు మళ్ళి చెక్కు పంపెదాకా వీళ్ళకి ఖంగారుగావుంది. మరొకరికి అలాగే పోస్ట్ వాళ్ళకి కొత్త అడ్రెస్ చెప్పలేదుట ఉద్యోగానికి ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది,వీళ్ళు వెళ్లి అది తెచ్చుకొనే సరికి టైం అయిపొయింది.గవర్నమెంట్ ఉద్యోగం చేయ్యిజారిపోయింది.చిన్న నిర్లక్ష్యం జీవితాన్ని మార్చి వేస్తుంది.కాస్త జాగ్రత్త బోలెడు సుఖాన్నిస్తుంది.

No comments: