Pages

Sunday, November 29, 2009

పూల చీర - 1

పూలచీర రచన: టి.జ్ఞాన ప్రసూన

చిక్కని నియాన్ లైట్ల కాంతిలో బజారు పెళ్లి పందిరిలా వుంది.మనుష్యులుకూడా పెళ్లి పందిట్లో లాగే హడావుడిగా తిరుగుతున్నారు. అవునుమరి,నెలలో మొదటివారం -ఎంత లేని వాడికయినా అంతో,ఇంతో లక్ష్మి దర్శనమిచ్చేవారం.
కల్పనా షోరూం చిన్న బల్బులు,పెద్ద బల్బులు,ట్యూబ్ లైట్ల మధ్య ఒయారాలు పోతోంది.షో కేసులో వున్నా బొమ్మ మరీ సోకు తిప్పుకొనే గొప్పింటి గారాల బిడ్డలా వుంది.కాక పొతే ఉండాల్సిన చోట్ల బట్ట లేదు..చీరలంటే నామ్కే వాస్తే గానీ ,చలికాలంలో బొంతలా కప్పుకోతానికి కాదు అని సందేశం ఇస్తోంది. కట్టిన చీర మాత్రం చాలా ఖరీదైన సిల్క్ చీర.బొమ్మ గర్వంగా నిలబడి వుంది.చీర ఇంకా నిర్లక్ష్యం గావుంది.నన్నే కదా ఎన్నుకొని అలంకరించారు -అని తననే కదా వచ్చేపోయే వాళ్లు ఆకలి కళ్ళతో ఆరాదిస్తున్నారని కాబోలు.పక్కనే నవ యువకుడి బొమ్మ.దానికి ఖరీదైన పాంట్.,సరిపడిన షర్ట్ అలంకరించారు.రెండిటికీ విడ దీయరాని అనుబంధం. ఎపాంట్ కి ఎషర్ట్ కొనాలో కొట్టులో గుమాస్టాలే చెప్తారు.ఒకవేళ ఎసామాన్యుడో కష్ట పడి డబ్బు దాచి పాంట్ కొనుక్కొందామని వెడితే ఆ షో కేసులో పాంట్ కొందామంటే ,ఆ షర్ట్ కూడా తీసుకొంటే తప్ప పాంట్ ఒక్కటి ఇయ్యడానికి ఒప్పుకోరు. సౌందర్యారాధన తెలియని అనాగరికుడిని చూసినట్టు చూసి,"పోనీ మరో పాంట్ తీసుకోండి."అంటాడు.
"కాదయ్యా షోకేసులోది బాగుంది.'
అయితే షర్టు కూదాతీసుకోండి "'
"అబ్బే! రెండూ ఇప్పుడు కొనలేనయ్యా!"
అయితే మీరు ఎంత డబ్బు తెచ్చారు!చెప్పండి. ఆ డబ్బుకు సరిపడా వేరే పాంట్ షర్ట్ చూపిస్తాను.
"షర్ట్ అఖ్ఖరలేదయ్యా!అన్తోంటే వినవేం "
"మల్లి మీరు వేరే షర్ట్ కొనుక్కోరుసార్ "
"బతుకంతా వాడు ఆ పెద్ద మనిషి వెనకే వున్నట్లు-ఆ పెద్ద మనిషి ఎప్పుడూ పాంట్లు మాత్రం కొని షర్ట్లు కొన్నట్లు మాట్లాడతాడు.ఇవన్నీ నాగరికపు మేర మేచ్చులు,మనిషిని ఊపిరాడనియ్యని ఉచ్చులు.మొత్తని కేలాగాయితేనేమి-షోకేసులో పాంట్లు, షర్ట్లు,చీరలు ఆలస్యంగానే అమ్ముతారు.

షాపు వీధి వేపు గుమ్మంలో కుచ్చెళ్లు పెట్టి వ్రేలాడదీసిన చీరలున్నాయి.రకానికొకటి చొప్పున వ్రేలాడదీసాడు యజమాని.వాటిలో ఒకటి చిన్న చిన్న పూలు అద్దిన చీర వుంది.అడికోట్లోకి వచ్చి ఎన్నో రోజులయింది.దాన్ని యజమాని ప్రతి నేలా మొదటి వారంలో బయట వ్రేలాడకడతాడు.ఆ వారమంతా ఆ చీర ఉదాసీనంగా వుంటుంది.దాని కల్లెప్పుడూ షో కేసులో వున్నా బొమ్మ మీదే వుంటాయి.ప్రతి రోజు ఆ బొమ్మ కట్టిన చీరని గుచ్చి గుచ్చి చూస్తూ వుంటాయి .చీర మీదున్న చిన్నచిన్న పూలు "ఎం మేముబాగాలేమా?"అని గునుస్తాయి.

ఒకసారి ఆబొమ్మకి నన్ను కట్టి చూడు పూల పూల తో ఎంత బాగుంటానో!అనియజమానికి ఎన్నో సార్లు సైగ చేసింది.
అయితేనేం ఆటను వినిపించుకోడు.ఆటను దేశ కాల పరిస్థితిని బట్టి వాడుస్తాడు.ఆ పూల పూల నేత చీరని షోకేసులో బొమ్మకి కదితెచూసే వాళ్ళంతా తన శాపునిండా అలాటి చీరలే వున్నాయని రారేమో?అని భయం.అంచేత సరికొత్త వెరైటీ,సరికొత్త డిజైను ఏరి ఆబోమ్మకు కడతాడు.పొరపాటు, కట్టిస్తాడు.షోకేసులో బొమ్మకి చీర కట్టడానికి చాలాకాలంగా ఒక తాత వస్తుంటాడు.ఆటను చీర కడితే అప్సరస దిగి వచ్చినట్లే ఉంటుందిట.అంచేత యజమాని ఆ తాత అడిగినంత ఇచ్చేవాడు.ఈమధ్య తాత రావడం లేదు.మనమడిని పంపిస్తున్నాడు.మనుమడు వచ్చాక ఆకర్షణీయమైన మార్పులు జరిగాయి.ఇతను బొమ్మకి చీర కట్టడామేకాడు,మూడువేపులా మూడు చీరలు వెనక కడుతున్నాడు.పమిట కొంగులు పైకి వచ్చేలాగా పరుస్తున్నాడు.ఆ శోకేసు షాపుకి ఆయువుపట్టులాంటిది.చాలా మందికి షోకేసులేని షాపుకు వెళ్ళాలంటే మనస్కరించదు..అంచేతనే ఆ షాపు యజమాని ఆ షోకేసుపైనే తన వ్యాపారం ఆధార పడి వున్దనుకొంటాడు.

పూల చీర తనని కనీసం వెనకైనా కడతాదేమో అని ఆశ పడింది.ఆ ఆశ నిరాశే అయింది.చ చ ఏమిబతుకు అనుకోండి.కావాలనుకొన్నది కాక పోయాక అని పమిట కొంగుతో కళ్లు వట్టుకొని,విసురుగా కొంగు విదిలించింది.అది వెళ్లి పక్కనున్న పాంట్ బట్టకి తగిలింది.పాంట్ బట్ట ఉలిక్కి పడింది.
"అరె!ఏమయింది?ఏడుస్తున్నావాకళ్ళలో ఇసక పడిందా?"అంది.
"కళ్ళలో ఏమిటి? వాళ్ళంతా ఇసకే?నేనేమన్నా షోకేసులో బొమ్మకి కట్టిన చీరలమా?మాయకుండా నాలాగా కుండా ఉండటానికి?"అంది.
పాంట్ సన్నగా నవ్వి"ఓస్ అదా!అబ్బ !నాకయితే ఆషోకెసు భోషాణం లా అనిపిస్తుంది.అందులో ఊపిరాడదు.ఒక్క మానవుడి స్పర్స తగలదు సరికదా,ప్రతి వాడూ గుచ్చి గుచ్చి చూస్తాడు.నాకు ఇక్కడే బాగుంటుంది.గాలికి ఉయ్యాల లూగుతూ వచ్చేపోయ్యే వారి మాటలు విన్తూకాలక్షేపం చెయ్యొచ్చు.'అంది పాంట్.
"ఏమి కాలక్షేపం?ఎన్నాళ్ళు కాలక్షేపం?అసలిక్కడ నుంచి కదలడం ఉందా?!"ఏమి కదలక షాపులో వాళ్ళం షాపులోనే ఉంటామా!రోజు బాగుంటే ఇద్దరం ఒకిన్టికే పోదాం,సారా?అంది పాంట్.
ఇంతలో ఒభార్యా భర్తా పిల్లలూ షాపులో జొరబడ్డారు.భార్య చరచరా లోపలికి వెళ్ళింది.వెళ్తూనే వాకిట్లో వున్నా పూల చీర చూపించి"అదిలా పట్రా అబ్బీ!అంది.




1 comment:

Anonymous said...

ఆవిడకి చీర నచ్చిందా? కొనేసిందా? నాకయితే ఆ చుక్కలచీర మీద భలే జాలేసింది. ఇక నేనే కొనేద్దామనుకున్నను. మీరు పడనీయలేదు!
ప్రసూనగారూ......బావుందండీ . షోకేస్ ని అక్కడి చీరలని అందరూ చూసే దృష్టితో కాకుండా మీరు మరో దృష్టితో చూడటం నిజంగా బావుంది