చల్ల బజారు
బందరు చెమ్మనగిరి పేటలో మా ఇంటి ఎదురుకుండా రెండు మూడు పచారు కొట్లు ఉండేవి.మధ్యలో చిన్నగదిలో ఒక తను బట్టలు విస్త్రీ చేస్తూ ఉండేవాడు.ఆకొట్లకి చాలా హుషారుగా తిరుగుతూ వుండేదాన్ని.గానుగెద్దు సర్కిల్ లాగా కొతదూరం వరకు తిరిగేందుకు మావాళ్ళు పర్మిషన్ ఇచ్చేవారు.పదేళ్ళు వచ్చేదాకా జీవితం హాయిగా గడిచిపోయింది.మనసు తేలికగా తూనీగలా వుండేది. ఆపచారుకొట్లలో అన్నీ సరుకులు దొరికేవి.ఇళ్ళల్లో నౌకర్లు చాకర్లు ఉండకపోతే ప్రతి పనికి పిల్లల్ని తోలేవాళ్ళు. పచారి కొట్టులో నాలుగు పలకలుగా వుండే గాజు సీసాలలో తినిబండారాలు పెట్టి అమ్మేవారు. అవేమిటో తెలుసా?శనగపప్పు ఉండలు,కొబ్బరి లౌజు ఉండలు, అప్పడాల పిండి ఉండలు, పాలకోవా బిళ్ళలు,వేరుశనగ పప్పు ఉండలు [ఇవిచాలా ప్రాణ ప్రదమైన ఫలహారం ఆరోజుల్లో]ఇలా రక రకాల ఉండలు.అమ్మ ఏదో తెమ్మని డబ్బులు ఇచ్చేది.ఆవుండలు చూస్తె నోరూరిపోయి అమ్మ మీద కోపం వచ్చేది.ఇన్నిరకాల తినుబండారాలుంటే అమ్మ అవేవో తెమ్మంటుంది ఏమిటబ్బా?అనిపించేది.ఆరోజుల్లో పాకెట్లు లేవు,పాకెట్ మనీసు లు లేవు.మరెలా వాటిని కొనుక్కు తినడం?పోనీ అణాఅన్నా ఉండేదికాదు.అమ్మ ఇచ్చిన డబ్బులో ఒక కానీ సొంతం చేసుకు కొనుక్కొందామంటే వెధవది ఏమికొనాలో తేలేదే కాదు. చివరికి అభిప్రాయం వేరుశనగ పప్పు ఉండల మీద నిలిచి పోయేది.అదిఆరగించిగౌను తడుపుకోకుండా మునిసిపాలిటీ పంపులో నీళ్ళు తాగి అమ్మకి ఆవస్తువు ఇస్తే "ఇదేమిటే!ఇంత తక్కువా!అనేది.ఏమో నాకేమి తెలుసు వాడిచ్చింది పట్టుకొచ్చాను,అని బుకాయించి లోపల ఆనంద పడిపోఎదాన్ని.అమ్మకి తెలుసు కాని నిలబెట్టి కూక లేసేదికాదు.ఇలావుండగా హటాత్తుగా జీవితం లోకి ఒక స్వర్ణ యుగం అడుగుపెట్టింది.ఒకరోజున నిత్య కర్మాగా కొట్టుకు వెళ్లాను.చాలా పిల్లలు గోలగా గుంపుగా నుంచున్నారు.ఎదోకొంతున్నారుకాబోలు వీళ్ళది అయాక మనం కొనుక్కోదామని వెనకనే వున్నాను.అప్పటినుంచే ఏమిటో వెనకగా వుండటం పెద్ద గొప్పగా వుండేది.పిల్లలు వెనుతిరిగి నాకు రెండువుండలు ఇప్పించారుచూసావా? అని చెప్పుకొంటున్నారు.తీరా చూస్తె అక్కడ ఒకాయన పూజారిలా వున్నారు,గావంచా కట్టుకొన్నారు,నుదుట పెద్ద నామాలు,పొట్టమీద,బుజంపైన నామాలు,వేనెక పిలక పూజారిగారని నిర్ణయం అయిపొయింది."దా తల్లి రా!అని నావంక చూసి ప్రేమగా పిలిచారు,ఆయన అలా నావంకే చూసి రెండు మార్లు పిలిచాక ఆహా నన్నే అని నమ్మకం కలిగాక వాళ్లనితోసుకొని ఒక అడుగు ముందుకు వేసా!తీసుకో తల్లి!నీకేమికావాలో తీసుకో అన్నారాయన.పక్కపిల్లలు తీసుకో వూరికేని ఇస్తున్నారు,అని డొక్కలో పొడిచి కనుసైగ చేసారు.నాలుగు నాలుగు రకాల ఉండలు తీసుకొన్నా,ఇక అదే పరుగు మా అమ్మ దగ్గర కెళ్ళి ఉదంతం అంతా చెప్పా.ఇవాళ ఏదో ఇచ్చారేమోలె!రోజు తీసుకోకుఅన్నది.చా!నీనేందుకు తీసుకొంటా!అన్నాను.సాయంత్రం పిల్లలందరం చేరినప్పుడు అన్డులోపెద్దపిల్ల "తాతగారు రోజు వస్తారట, మనందరికీ రోజు కొనిపెదతారట!ఇవాళ ఆయన వెళ్ళిపోయాక కొట్టాయన్ చెప్పాడు.అన్నది .ఉత్తిదిలే!అనుకోన్నాకాని మళ్ళి లర్నాడు అదే సమయానికి ఆయన కొట్టు దగ్గరికి రావడం పిల్ల సైన్య గుమిగూడటం మేడపై నుంచి చూసా. మా అమ్మ చూడకుండా పిల్లిలా వెనక మెట్ల మీదనుంచి దిగి బాణం దూసుకుపోయి నుంచున్నా.ఆయన ఇలాచూసారు,తీసుకో!అన్నట్లు.తీసేసుకొన్నా. అలా చాలా రోజులు గడిచాయి,ఆయన వచ్చ్సమయానికి వరండాలో నుంచిని కాపలా కాసి,ఆయన అల్లంత దూరంలో కనపడగానే అమ్మా!కోటలో ఏమన్నాకావాలంటే ఇప్పుడే చెప్పు తెచ్చ్పెదతా.తరవాత చదువుకోవాలి అని జారుకోనేదాన్ని.ఆయన ఎందుకలా తీపిని పంచిపెట్టారో తెలియదు.ఆయన తరవాత కొన్నాళ్ళకి రావడం మానేశారు.ఆయనకీ చాలా రుణ పడివున్నా అనుకొంటూ ఉంటా .చల్ల బజారు గురించి మళ్ళి వ్రాస్తా.
తాబేలు
1 comment:
ఎవ్వరు ఏమీ అనరు లే అని ఇప్పుడు రహస్యాలన్నీ బయత పెడుతున్నారు. మీ పిల్లలు చదువుకుని నేర్చుకుంటారు లెండి. సారీ పిల్లలు కాదు మనమళ్ళూ మనమరాళ్ళూ ..
Post a Comment