Pages

Thursday, October 7, 2010

రాకపోకలు

రాకపోకలు
సమాజంలో ఐకమత్యంగా ఉండాలన్నా,భందుత్వాలు బతకాలన్నా రాకపోకలు కావాలి. మేము డిల్లి లో వున్నపుడు పెళ్ళిళ్ళకి,ఒడుగులకి,పండగలకి,పబ్బాలకి దేనికి రాలేకపోయే వాళ్ళం.
ఎందుకంటే ఆంధ్రా రావాలంటే కనీసం పది రోజులయినా సెలవులు కావాలి.
పిల్లలకి ,ఈయనకి ఎప్పుడు సెలవలు కలిసి వచ్చేవి కావు. అందువలన
సెలవుల లోనే ఆంధ్రా వచ్చేవాళ్ళం.బెజవాడ వెళ్ళాలి,ఏలూరు వెళ్ళాలి
హైదరాబాదులో అందరిని కలవాలి. రాగానే వారాలు చెప్పుకొని ఒకోరోజు ఒకళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం. మాస్నేహితురాలు గుమ్మంలో అడుగు పెట్టగానే అడిగేది"చూసిపోదామని వచ్చావా?ఉండటానికి వచ్చావా?"అని.
వుండాటానికి టైమే ఎదే? చూసిపోదామనే వచ్చాను అంటే "సరే !చూసావుగాపో!లోపలి కూడా ఎందుకు?అనేది.మనం కావాలనుకొని మనతో మనసు విప్పి మాట్లాడే వాళ్ళ ఇంటికి వెళ్లి గడపలేముకాని,సతాయించి ,సాగాదీసుకొనే వాళ్ళ ఇళ్ళకి తప్పక వెళ్ళాల్సి వచ్చేది.డిల్లి లో అందరం నెలకొక సారైనా ఏదో వంకన కలుసుకొనే వాళ్ళం.మరీ వీలుకాకపోతే ఫోనులో తప్పక మాట్లాడుకొనే వాళ్ళం. ఇక్కడికి వచ్చి బందువల ఇళ్ళకి వెళ్లి "ఎరాబావా! నారాయణ్ బాబాయి ఎలావున్నాడురా?అంటే "ఏమోనే!వెళ్లి చాలారోజులయింది"అనేవాడు మాబావ."ఏమి వాళ్ళు ఇల్లు మారారా?"అబ్బే !అదెఇల్లు ,పక్క సందులోనే కదా? నాకు చాలా ఆశ్చర్యం వేసేది.పక్కపక్కనే వుంది ఆరు నెలలయినా ఒకరింటికి ఒకరు వెళ్ళకుండా వున్నారా?అని.పనేమన్నా వుంటే వెళ్ళాలి,ఏమీ లేదు అనేవాడు.వాళ్ళింట్లో ఏదో శుభ కార్యమయి భోజనానికిపిలిస్తే వెడతాడట .వూరికే వెళ్ళకూడదా?హాయిగా సాయంత్రం పూట వెళ్లి కాసేపు కూచుని పిచ్చా పాటి మాట్లాడుకొని రాకూడదా?మళ్ళి వాళ్ళని తన ఇంటికి పిలిచి కాఫీ ఇచ్చి కబుర్లు చెప్పుకో కూడదా?ఎంత తెలిసిన వాళ్ళ యినా సరే చూస్తె నవ్వాలని,నవ్వితే పలకరించాలని,పలకరిస్తే ఏదైనా పని చెపుతారని ఇలా ఊహించుకొని అసలు మొహం తిప్పెసుకొంటారు.
మాకు తెలిసిన ఇద్దరు అన్నదమ్ములున్నారు.ఈరోజుల్లో అందరికి ఉద్యోగాలేగా!కాని ప్రతి ఆదివారం ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాలు కలుసుకోనేవారు.ఒకసారి వీళ్ళు వెడితే ఒకసారి వాళ్ళు వచ్చే వారు. ఆప్యాయంగా కలిసి భోంచేసి ఇద్దరు కలిసి ఎస్నేహితులింటికో వెళ్లి
రాత్రికి ఎవరి గూటికి వాళ్ళు చేరేవారు.అందువలన ముఖ్యంగా వాళ్ళ పిల్లలు కలిసిపోయి ఆడుకొనే వాళ్ళు.శివరాత్రికి సంకురాత్రికి కలిస్తే ఒకళ్ళని చూస్తె ఒకళ్ళకి కొత్తదనం,భయం .రాకపోకల మధ్య దూరం ఎక్కువయితే భందుత్వాలుకూడా తుప్పు పట్టిపోతాయి.

1 comment:

gajula said...

meeru cheppindi 1000%correct