నా చేతిపనులు
1
పైన పెట్టిన నాలుగు ఫోటోలలో నేను తయారు చేసిన వస్తువులు చూసారు కదా! వీటన్నిటికి
మెటీరియల్ మాశీమా నాకోసం దాచి పెట్టి ఇచ్చింది. ఇవన్ని పనికిరాని కట్ పీసెస్. ఇందులో
మొదటిది చిన్న టేబుల్ మాట్! చీరల పమిట అంచులు జిగ్ జాగ్ చేసే తప్పుడు సంనపీలిక కత్తిరిస్తారు. వాటితో తయారు చేసాను. అవింని పొడవు ప్రకారం,రంగుల ప్రకారం విడదీసుకొని మూడు ముక్కలు కలిపి జడ లాగా అల్లాలి. దీన్ని ఎంతైనా పొడిగించుకోవచ్చు. పీలిక అయిపోయిన చోటల్లా మరో పీలిక కలిపిఅల్లుకు పోవడమే! అల్లాక గుండ్రం గా కావాలంటే గుండ్రంగా ,నలచదరం గా, కోడి గుడ్డు ఆకారం గా కావాలం టే ఘట్టిగా కుట్లు వేసుకోవాలి.
రెండవది చిన్న పర్స్ . సిల్క్ బట్టలోపల స్పాంజ్ పెట్టి చుట్టూ కాజా కుట్టు కుట్టాలి.అలాటివి రెండు చేసి పర్స్ చేసాను దీనికి ప్రెస్ బట్టన్స్ కుట్టుకో వచ్చు లేకపోతె జిప్ పెట్టుకోవచ్చు.చిల్లర వేసుకొని హాండ్ బాగ్ లో పెట్టుకోటానికి బాగుంటుంది. కత్తిరింపు ముక్కలలో పనికి వచ్చేవి తీసుకొని చేశా.
మూడవది మఖుమల్ బట్టతో చేసాను.నల్లది ఒకటి ,తెల్లది ఒకటి.తెల్లది అందంగా వుంది, నల్లది ధాటీగా వుంది దానికీద జరీ తో ఎంబ్రాయిడరీ చేసివుంది. తెల్లదానిమీద తెల్లటి వెండి పూసలతో ఎంబ్రాయిడరీ వుంది, అలాటిదే రెండు అంచులు వుంటే సంచి పట్టుకోడానికి కుట్టాను.
అవి కుట్టగానే డాక్టర్ .వసు సెల్ ఫోన్ పెట్టుకొంటానని తీసుకెళ్ళింది.
నాలుగోది కూడా చిన్న . పర్స్. తెల్లటి సిల్క్ బట్ట పై మెరుస్తూ సెల్ఫ్ డిజైన్ వున్నది రుమాలు కుట్టాను.మాశీమా ఇచ్చిన వాటిని బీరు పోకుండా సొమ్ము చెయ్యాలని తాపత్రయం.
ఇంకా కొన్ని చేయాలి. చేసాక సురుచిలో పెడతాను. కాదేదీ కవిత కనర్హం అన్నట్లు,ఎంత చిన్న బట్టయనా
ఏదో ఒకటి చెయ్యొచ్చు.
2 comments:
నిజంగా మీ చేతిలో ఎంత సృజన ఉందండీ.. అభినందనలు...
మీరు పెట్టిన ఈ మొదటి ఫోటో ఉంది చూసారూ! నేను అలాంటిదే మనం వాడి పారేసే ప్లాస్టిక్ సంచులతో చేసాను.
Post a Comment