ఒక్కమాట
సుందరం,సావిత్రి, కూతురు ఉష ఆదివారం ఉదయం తీరుబడిగా కూర్చుని కాఫీ తాగుతున్నారు.సిగరెట్టు ముట్టించి పొగ గాలిలోకి వలయాలుగా వదిలాడు సుందరం. ఉష అదిచూచి నిట్టూర్చింది. తాతయ్యలు,అమ్మమ్మలు, బామ్మలు అంటే పిల్లలకి ఇష్టం కదు నాన్నా! వాళ్ళు మనమలకి కధలు చెపుతారు,లాలిస్తారు, ప్రేమిస్తారు,క్షమిస్తారు, ముద్దులాడతారు అంది. అవునమ్మా!మనమలంటే ప్రతిబింబాలు, వంశానికి నిచ్చెన మెట్లు అన్నాడు సుందరం . ప్చ్! నా పిల్లలకి ఆ అదృష్టం వుందో!లేదోE అంది తలవంచుకొని . అలా ఎందుకు అనుకొంటూ న్నావంమా!మేము లేమూ! నెత్తిన పెట్టుకొని చూస్తామమ్మా!మీరేమి చూస్తారు నాన్నా! మీరిలాచైన్ స్మోకింగ్ చే స్తుంటే నాకు పిల్లలు పుట్టే దాకా బ్రతుకుతారా? అంది. అంతే! సుందరం మనస్సు మెలికలు తిరిగిపోయింది. సి గరెట్టు పెట్టె లైటర్ డస్ట్ బిన్
లోకి విసిరేశాడు. మళ్లి సిగరెట్ ముట్టుకోలా. నిజంగా చెప్పుకోతగ్గ తాతగారు కదూ!
No comments:
Post a Comment