రాజమ్మ టీచరుగారు
మా అమ్మ హిందీ చదువుకొనే టప్పుడు రాజమ్మ టీచరుగారి హాలులోకి వున్న
మా గది తలుపుతీసి నన్ను ఆ గుమ్మంలో కూర్చోమనేది. రాజమ్మ టీచరుగారు కూడా క్లాసులో నేర్చుకొనే వారు. అప్పటినుంచే మాఇంట్లో నాన్న గారు,అమ్మ ఖద్దరు కట్టడం ప్రారంభించారు. నాకూ ఖద్దరే!దుప్పట్లు ,తువాళ్ళు,చేతి రుమాలాలు అన్ని ఖద్దరే! మానాన్నగారు,అమ్మ పెళ్లిళ్లకు వెడితే వీళ్ళకోసం
ప్రత్యేకం ఖద్దరుబట్టలు కొని పెట్టేవారు. నేను అప్పుడే హిందీ భాష విన్నాను. మాణి క్యామ్బగారు పాఠం
చెబుతుంటే , హిందీ కవితలు పాడుతుంటే ఏమిటో తెలియని ఆనందం.
అంత చిన్నప్పటి విషయాలు నాకుబాగా జ్ఞాపకం వున్నాయి. చంటి పిల్లలు,వాళ్ళకేం తెలుసు అనుకొంటాం గాని ఆవయసులో మనసుకి ప్రతి విషయాన్ని హత్తుకొని మనసులో ముద్రించుకొనే శక్తి అపారంగా వుంటుంది. ఆ విషయాలను మళ్లి మళ్లి నెమరు వేసుకొంటే టీచరు అంటే అలా వుండాలికాబోలు, నాన్నగారిమీద అంత మమకారం వుంటుంది కాబోలు , ఆట పాటల్లో హాయి, కల్మష రహిత మైన స్నేహ సంపద అలా వుంటుంది కాబోలు అనిపిస్తుంది. ఇప్పటికి నాకు మీనాక్షి ఎక్కడైనా కనిపిస్తే బాగుండును అనిపిస్తుంది,అత్తవారు ఏలూరు అనిచెప్పారు.భోగరాజు వారికిచ్చారని విన్నాను.కాని ఇంకేమీ తెలియదు.రాజమ్మ గారి రూపం ఇప్పటికి గుర్తుంది. ఆమెపై ఆరాధన
నా గుండెల్లో దీపాలు వెలిగిస్తూనే వుంది.
1 comment:
చాలా బాగుందండి. మీకు నా హృదయ పూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.
Post a Comment