నాన్నా!
వళ్ళో కూర్చో బెట్టుకొని తీపి తినిపించి
జీవితాన్ని గురించి ఎన్నో ఛే దు
సత్యాలను చెవిని వేసావు
మట్టిలో ఆడుకో నివస్తే
అరికాళ్ళు సబ్బుతో రుద్ది ,కడిగి
ఉత్తరీయంతో వత్తి ముద్దుపెట్టుకోన్నావు
అడుగు వేస్తె, పలుకు పలికితే
అక్షరం వ్రాస్తే,నాన్నా అనిపిలిస్తే
ఆనందంతో కొండెక్కి పోయావు
నాన్న అంటే తెలుసుకొనే సరికి
నలభై దాటిపోయింది
తెలిసాక నువ్వేదాటి పోయావు
నాన్నా!దాసుడి తప్పులు
దణ్ణం తో సరి, నీ జ్ఞాపకాలే నాకు
ఆకుపచ్చని బయళ్ళు !
వళ్ళో కూర్చో బెట్టుకొని తీపి తినిపించి
జీవితాన్ని గురించి ఎన్నో ఛే దు
సత్యాలను చెవిని వేసావు
మట్టిలో ఆడుకో నివస్తే
అరికాళ్ళు సబ్బుతో రుద్ది ,కడిగి
ఉత్తరీయంతో వత్తి ముద్దుపెట్టుకోన్నావు
అడుగు వేస్తె, పలుకు పలికితే
అక్షరం వ్రాస్తే,నాన్నా అనిపిలిస్తే
ఆనందంతో కొండెక్కి పోయావు
నాన్న అంటే తెలుసుకొనే సరికి
నలభై దాటిపోయింది
తెలిసాక నువ్వేదాటి పోయావు
నాన్నా!దాసుడి తప్పులు
దణ్ణం తో సరి, నీ జ్ఞాపకాలే నాకు
ఆకుపచ్చని బయళ్ళు !
1 comment:
happy fathers day,
chakkani kavitha.
Post a Comment