Pages

Sunday, July 22, 2012

maa peratlo mokkalu

ఈ చెట్టు    నేను వచ్చేసరికి    ఆకులేదు,ఎండి పోయివుంది.    ఎండ లోపెట్టి నీళ్ళుపోసి చూద్దాము.ఒక వారం లోపల
ఆకు రాకపోతే  తీసేద్దాము,అనుకొన్నా. ఈచేట్టుకి   దుంప ఉంటుది లోపల,అంచేత    మళ్ళి          బతుకుతుందని నీళ్ళు   పోసా. వారానికి  ఆకు తొంగి చూసింది.  ఇప్పుడు రెండు ఆకులు వచ్చాయి.  దీని తమాషా  ఏమిటంటే  రాత్రి కాగానే  ఈ
ఆకులు  కుండీ అంచు మీదకి వాలి నిద్రపోతాయి. తెల్లారి   నిలబడతాయి. దీని పేరు తెలియదు.నిద్ర చెట్టు అనిపెట్టా.
                      పక్క కుండీ   లో మొలకలు   "బసెల్ "   ఇది   తులసి     జాతికి చెందింది.    వాసన  కొంచెం   ఘాటుగా  వుంటుంది.  పిజ్జాల పై    ఈ  ఆకులు జల్లుతారట.    ఐసే   క్రీమ్లో, చాక్లెట్లలో   కోడా  ఉపయోగిస్తారట.  ఆయుర్వేదం మందులలో    కూడా      వినియోగిస్తారట.  మనవేపు తక్కువేకాని,విదేశాలలో      బాగా    వాడతారు.
మంచి పరిమళం.
                         ఆ   పక్కన    కనిపిస్తున్నాయే     అవి  బచ్చలకూర. ,  వీటిని   వేరే  కుండీల లోకి      పంపిణీ  
చెయ్యాలి. ఇది తీగ   అనుకొంటాను.    పందిరి వెయ్యాలి.