Pages

Monday, August 27, 2012

snehanseeli sarada kotamraju









                                     స్నేహశీలి     కోటంరాజు        శారద

                                          పిల్లలు స్కూళ్ళకి వెళ్ళారు ,అప్పుడే మా   వారు  ఆఫీసుకు దయచేశారు.  ఒకకప్పు తేనీరు సేవించి    కొంగు బిగించి      తక్కోన పనులు     మొదలెడ  దామనుకొంటుండగా    ఫోన్ మోగింది.  రిసీవర్ చెవిదగ్గర పెట్టుకొంటే    అవతలి వుంచి     శారద   భర్త గారు    కోటంరాజు ప్రతాప్ గారి గొంతు    సన్నగా ఉదాసీనం గా పలికింది."అమ్మా!  క్షమించాలి, నా నోటితో     నేనే    చెప్పుకోవలసిన     దౌర్భాగ్యం    పట్టింది.  "అన్నారు.  క్రితం రోజే   శారదకి     కంటి   ఆపరేషను అయింది.   అదేమయినా    గడబిడ జరిగిందా?అని భయం వేసింది. శారద ఎలావున్నారు?అన్నాను.   "ఏమి చెప్పనమ్మా! అమెరికాలో వున్నమా    రెండో   అబ్బాయి     రాత్రి   కారు   ఆక్సిడెంట్  లో  చనిపోయాడమ్మా! అన్నారు అయ్యో !అదేమిటి అన్నాను.  మా ఖర్మ    శారద  దగ్గర   ఎవరు లేరు  ఒకసారి రాగాలవామ్మా!అన్నారు.   వస్తున్నానండీ అని ఉన్నపళాన   లేచి   వెళ్లాను.   హాలులో   ఆయన   విచారంగా   కూర్చున్నారు. లోపల గది వేపు వేలుతో చూపించారు.   దడ   దడ     లాడుతూ గదిలో అడుగు పెట్టాను. నిజానికి     ఇటువంటి    సమయంలో    ఏమని పలక రించాలో, ఎలా  ఓదార్చాలో    అయోమయం అయిపోతుంది. శారద    మూర్తీభ వించిన శోక దేవతలా    మంచం పై కూర్చుంది. దగ్గర కూర్చుని చేయి చేతిలోకి తీసుకొన్నాను. 'చూడండి !ఎలా జరిగిందో!  వాణ్ని ఇక్కడికి తీసుకురాలేము,  మేము వఎల్లలేము ,మా పెద్దబ్బాయి అన్ని చూసుకొంటున్నాడు.  నాకంటికి ఆపరేషను   ఇప్పుడే   జరగాలా?  ఏడవడానికి కూడా   పర్మిషను లేదు.   ఆమె గుండెల్లో   కన్నీళ్ళ సుడి గుండాలు    తిరుగుతున్నాయి.  మాత్రు హృదయానికి ఇంత కంటే    క్షోభ    ఏముంటుంది. ఇద్దరం అలా  కూర్చున్దిపోయాము,   వాళ్ళు,వీళ్ళు      వచ్చి పలకరించి పోతున్నారు.
ఆనాటి శారద     స్థిర ప్రజ్ఞాత్వం     నా మనో ఫలకం పై      నిలబడిపోయింది.
                     ఫామిలీ ఫ్రెండ్స్    అనే పదానికి సరైన తెలుగు మాట    నాకు దొరకడం లేదు. లలిత ,సుశీల,కల్పకం ,వరలక్ష్మమ్మ గారు,శారద ,సక్కుబాయి   అంటా మా  కుటుంబానికి   ఆప్తులు.  శారద చాలా   విశాల హృదయంతో మాట్లాడేది. కల్మషం లేని మనస్సు.  నవ్వుతు  గలగలా కబుర్లు చెప్పేది.  డిల్లి లో మేము తరుచు కలుసుకొనే వాళ్ళం.  ఆమె భర్త కోటంరాజు ప్రతాప్ గారు అరబ్   నార్త్   ఆఫ్రికాలో   టునీషియ   లోని కార్తాజ్ లో మాజీ  భారత రాయబారిగా  పని చేసారు.  శారద    కిఇద్దరు అబ్బాయిలు,ఒక అమ్మాయి.శారద చదువు సంస్కారం గల వ్యక్తీ.
ఆసంస్కారం    ఆమె సంభాషణలో     గుబాళిం చేది .ఆ తరవాత వాళ్ళు  వాళ్ళ పెద్దబ్బాయి ప్రదీప్ దగ్గరికి  అమెరికావెళ్ళిపోయారు.  ఇండియా    వచ్చినపుడల్లా    తప్పక కలిసే వాళ్ళం.
                          రోజులు అడ్డం మీద    ఆవగింజల్లా   చాలా   దొర్లిపోయాయి. మా పిల్లలు పెద్దవాళ్ళయి   US వచ్చారు. ఒకసారి సక్కుబాయి     శారద ఫోన్ నెంబర్     అడ్రస్     ఇచ్చింది. అప్పటినుంచి  ఎప్పుడు US వచ్చినా  శారదకి     ఫోన్ చేసి   క్షేమ సమాచారం    కనుక్కుంటూ వుంటాను.
                                     శారద వాళ్ళ కుటుంబం అంటా US   సిటిజెన్స్.  శారద తన కొడుకు నిర్మల్ తో కలిసి
కాథలిక్ యూనివెర్సిటీ  ఆఫ్ అమెరికాలో    చదివింది. లైబ్రరీ అండ్   ఇన్ఫర్ మేష న్ లో మాస్టర్ డి గ్రీ   పొందింది.లైబ్రరీ లంటే  తనకి    చాలా ఇష్టం "  మనిషికి     విజ్ఞానానికి మధ్య వంతెనలు లైబ్రరీలు .మీరు సరిగ్గా    వెతుక్కొంటే    లైబ్రరీలో   మీరు కోరుకొన్న దానికంటే     ఎక్కువ లాభం పొందుతారు.కార్డుల ద్వారా,ఆన్ లైన్ కాట లాగుల   ద్వారా,లైబ్రరీల లోని      ఉద్యోగుల  .ద్వారా    మీరు కావలసిన పుస్తకాలు తెచ్చుకొని ఉపయోగించుకోవచ్చు.  దేవాలయం,విద్యాలయం   లాగా    గ్రందాలయము అతి పవిత్ర మైనది"అంటుంది శారద
                                       మొన్న US    వచ్చాక     అలవాటు ప్రకారం    శారదకి     ఫోన్ చేసాను.  జవాబు లేదు.ఎవూరయినా    వెళ్ళిందే మో !అనుకొన్నాను. ఫోన్ పెట్టేసాను.   కొంత సేపటిఉకి ఫోన్ మోగింది. ఎవరో ఇంగ్లీషులో    మాట్లాడారు. సరదాగారితో మాట్లాడాలి అన్నాను.ప్రతాప్ గారితో    మాట్లాడతారా?అన్నదామె. సరే నన్నాను. ఆయనకీ ఫోన్ ఇచ్చింది.  నేను ఫలానా  అని చెప్పాను. ఆయనకీ కి గుర్తు తెచ్చుకోవడానికి ఒక నిముషం పట్టింది.  "అమ్మా!  దగ్గిర  వాళ్లకి కూడా  చెప్పుకో లేకపోయానమ్మా!  శారద ఇక లేదు. మొన్న డిసెంబరులో  11  న   నన్ను విడిచి   వెళ్లి పోయిందమ్మా! అన్నారు రుద్ధ కంఠంతో.   నాకు మాట రాలేదు."ఈ వయస్సులో   మీకెంత   కష్టం    వచ్చిందండీ!  నాకు తెలియనే లేదే!  సక్కుబాయికూడా   బెంగుళూరు    విడిచి వెళ్ళింది.  కబుర్లే తెలియలేదు,   సో సారీ అండీ అన్నాను.  శారద  భౌతిక మైన దృష్టికి కనపడదు కానీ,   మా  మనస్సులో   నిలిచే వుంది. ప్రతాప్ గారే సండే న్యూస్ రీడర్     పేపర్ కట్టింగ్   పో స్ట్    లో పంపారు.  ఆమెని గురించి దాదాపు సగం పేజి ఫోటో ల తోసహా     వేసారు.  ఇది ఎంత గర్వ కారణం?   తెలుగు బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా వెలుగు దివ్వె లే!
                                                     



2 comments:

Rao S Lakkaraju said...

sorry to hear that.

susee said...

sarada gaari akaala maranam pratap gaariki- itu aame mitra koti ki koodaa ashanipaatham .manchi mitrunni sampaadinchukovadamu oka adrustame ayithe- aa mitruni bhoutikam gaa kolpovadam daanini minchina duradrustam, ani naa abhipraayamu. naa vaallu ankunna naa manchi mitrulu yendaro - naa kallamunde kanumarugaiyaaru.yetochhee , vaari smruthulu gundelalo goodu kattukuni bhadram gaa vunnaaayi. jnaana prasuna gaaru sarada gaariki samarpinchina nivaali amoolyam.