నగరాజ సుతా
నగరాజ సుతా!నటరాజ సతీ !
నళిన దళాయ తాక్షీ !నిన్నే నమ్మితినమ్మా!
పట్టు పరుపులు వేసి,బాలీసు లమరించిన
పసిడి సింహాసనము పై వేంచేయ వమ్మా!
భక్తీ-శ్రద్ధలు రెండు వింజామరలు చేసి
వీవగా నిలిచితిమి విశాలాక్షీ!రావమ్మా!
పంచ నదుల నీరు పన్నీరుగా తెచ్చి
పాదాలు కడిగేము ఫాల లోచను రాణి !
అరిషడ్వర్గాల ఆరు ఫలములు తెస్తి
ఆరగింపగ జనని అందుకోవమ్మా!
నీవెనక నీపతియు ఆ వెనక సుతులు
అందముగా అరుదెంచి విందు చేయగా రండి!
నగరాజ సుతా!నటరాజ సతీ !
నళిన దళాయ తాక్షీ !నిన్నే నమ్మితినమ్మా!
పట్టు పరుపులు వేసి,బాలీసు లమరించిన
పసిడి సింహాసనము పై వేంచేయ వమ్మా!
భక్తీ-శ్రద్ధలు రెండు వింజామరలు చేసి
వీవగా నిలిచితిమి విశాలాక్షీ!రావమ్మా!
పంచ నదుల నీరు పన్నీరుగా తెచ్చి
పాదాలు కడిగేము ఫాల లోచను రాణి !
అరిషడ్వర్గాల ఆరు ఫలములు తెస్తి
ఆరగింపగ జనని అందుకోవమ్మా!
నీవెనక నీపతియు ఆ వెనక సుతులు
అందముగా అరుదెంచి విందు చేయగా రండి!
1 comment:
నవరాత్రుల ప్రారంభవేళ నగరాజసుతకు మీ కవిత నజరానా!
Post a Comment