Pages

Wednesday, January 16, 2013

మంచం పక్కన ఊరగాయ జాడీ!

                                   మంచం పక్కన     ఊరగాయ జాడీ


                        మా నాన్నగారి     పడక గదిలో      మంచం పక్కనే     ఒక ఊరగాయ జాడీ    వుండేది. మానాన్నగారు   పడుకోబోయే ముందు      జేబులోంచి చిల్లర తీసి   ఆ     జాడీ లో పోసి    జేబు ఖాళీ చేసుకొని  
ప డు కోనేవారు.  చిన్నప్పుడు నాకు ఆచిల్లర డబ్బులు జాడీలో పడుతూ చేసే ధ్వని     చాలా    ఇష్టం గావుండేది.
ఖాళీ  జాడీలో     నాణేలు    గిరగిరాతిరిగి  పడుతుంటే నాకు ఆ  ధ్వని ఏదో    సంగీతం లా   అనిపించేది.జాడీలో అడుగుభాగం   నాణే లు  పరుచుకోగానే     చిల్లర వేసినప్పుడు వచ్చే ధ్వని   మందగించేది.తెల్లవారి సూర్యోదయం అవగానే  కిటికీ లోంచి కాంతి కిరణాలు వచ్చి ఆ జాదీపై పడేవి,కొన్ని లోపలి తొంగి చూచేవి, అప్పుడు నేను జాడీ దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని  జాడీలోకి తొంగిచూస్తూ కొంచెం సేపు అలా   ఉండిపోయే వాణ్ణి .అందులో కొన్ని నాణాలు రాగివి,కొన్ని నికిల్ వి. చిన్నగా పెద్దగా    గుండ్రాలు ,గుండ్రాలు గా వుండే ఆ నా ణాలు    చూస్తూంటే ఏంతో హుషారుగా వుండేది .
                                 కొన్ని నెలలకి    ఆ జాడీ చిల్లరతో నిండిపోయేది. అప్పుడు నాన్నగారు జాడీ ని డైనింగ్ టేబల్
మీద బోర్లించి  వేటి కవి విడివిడిగా     బొత్తి   పెట్టి    ఎన్నిరూపాయలో లెఖ్ఖ కట్టి ,వాటిని బ్రౌన్ కలర్ కాగితాలలో చుట్టి బ్యాంకు కి తీసికేళ్ళే వారు. అప్పుడు నన్ను కూడా  వెంట  తీసుకెళ్ళేవారు. వెళ్ళేటప్పుడు    చిల్లర  నా  ఒళ్ళో పెట్టుకొనే వాడిని   మానాన్న నావంక చూసి ఆప్యాయంగా    "నాన్నా! నువ్వు నాకుమల్లే కష్ట పడకూడ దురా !అందుకే ఈడబ్బంతా పోగేస్తున్నాను.  నువ్వు ఈడబ్బుతో    బాగా చదువుకోవాలి"అనేవారు. చిల్లర బ్యాంకు కి వెళ్లి జమ చేయడం కార్యక్రమం    భలే    సరదాగా వుండేది.చిల్లర బ్యాంకు లో కాషియర్ కి అప్పచేపుతూకూడా   నాన్నగారు"మా  అబ్బాయి నాకు మల్లె కష్ట పడ కూడదండీ !మంచి చదువులు చదివి హాయిగా,ఉద్యోగం చేసి   దర్జాగా  బతకాలి."అనేవారు.
                                              బ్యాంక్  లో చిల్లర జమ చేసిన రోజున మేము పండగ చేసుకోనేవాల్లము.నాన్నగారు నన్ను ఐస్ క్రీమ్ పార్లర్ కి తీసుకువెళ్ళి కొన్ కొనిపెట్టే వారు, షాపు యజమాని చిల్లర ఇవ్వగానే ఆచిల్లర అరచేతిలోపోసి చూపిస్తూ నాతొ అనేవారు"పద .ఇంటికి వెళ్లి ఈచిల్లర జాడీలో వేసి మళ్లి   నింపడం మొదలుపెడదాం "అనేవారు. ఆయన అంట ఉత్సాహం తో   ఆజాదీని నింపుతూ వుంటే   నాకు బాగా  అర్ధం   అయేది కాదు.జాడీలో మొదటి సారి నా చేతనే   చిల్లర వేయించేవారు. ఆ  నాణేలు గిగిరాతిరిగితే    మేం ముసిముసి నవ్వులు నవ్వుకోనేవాళ్ళ ము "ఈపది పైసలు యాభై పైసలు ఈవే నిన్ను కాలేజీలో చేర్పిస్తాయి. మళ్లి నీకు ఇంతకూ రెట్టింపు
వస్తాయిలే!అనేవారు నాన్న ఆశగా .
                                           రోజులు గడిచిపోయాయి.కాలేజి చదువు పూర్తీ చేసి ఉద్యోగం లో చేరాను. ఒకసారి ఇంటికి వెళ్లాను. ఫోన్    నాన్నగారి పడక గదిలో వుంటుంది. ఫోన్ చేద్దామని వెళ్లాను. ఫోన్ చేస్తూ మంచం వేపు చూసాను. గుండె గతుక్కు మంది.   అక్కడ జాదీలేదు,ఖాళీగా వుంది. ఓహో!  ఇప్పుడు చిల్లర దాచే  అవుసరం లేదు అందుకని జాడీ  తీసేశారు అనుకొన్నాను.
                                     మా  నాన్నగారు చాలా మిత భాషి. "నిశ్చయాలు ,విశ్వాసం,"ఇలా  లెక్చరు ఇచ్చేవారు కాదు.అవి చెప్పేవన్నీ జడ పదార్ధమైన  ఈ  జాడీ    నాకు చెప్పింది.నా వివాహం అయాక నా భార్య సుష్మకి జాడీ గురించి చెప్పాను. నా  చిన్నతనం లో ఈజాడీ ఎటువంటి పాత్ర వహించిందో<ఏ ఏ  పాఠాలు నేర్పిందో వివరించాను.మానాన్నగారు నన్ను ఎంతగా  ప్రేమించేవారో    విశదీకరించాను.ఇంట్లో ఎన్నో గడ్డు పరిస్థితులు వచ్చేవి. ఒకోసారి వట్టి శనగలు   తిరగామూతలో వేసి తిని ఆకలి తీర్చుకొనే వాళ్ళం.అయినాసరే మానాన్నగారు జాడీ లోంచి ఒక్క పది పైసలు తీసే వారుకాదు.ఆ శనగలపై కొంచెం మజ్జిగాపోసి   తినడానికి అనువుగా చేసి "నువ్వు కాలేజీ చదువు అయిపోయి ఉద్యోగం చేస్తే   ఇలా  ఎప్పుడూ శనగలు తినే పరిస్థితి రాదురా!నీకు మనసైతే తప్ప..."అనేవారు.
                                  మా అమ్మాయి జయంతి పుట్టింది. శేలవుల్లో  నాన్నగారిదగ్గరకి వెళ్ళాము. అమ్మా,నాన్నగారు పాపాయిని ఒళ్ళో పెట్టుకొని ,ఒకరొకరు మార్చుకొంటూ ముద్దులాడుతున్నారు.జయంతి కొంచెం చికాకుగా వుంది. మా  ఆవిడ డైపర్   మార్చడానికి నాన్నగారి గదిలోకి తీసుకు వెళ్ళింది.డైపర్ మార్చి పాపాయిని వాల్లకందించింది. నా చేయి పుచ్చుకు గదిలోకి తీసుకు వెళ్ళింది."చూడు" అని మంచం వేపు చూపించింది.ఆశ్చర్యం
ఆకడ చిల్లర జాడీ ఎప్పటి నుంచో  వున్నట్లు నిబ్బరం గ వుంది.  వెళ్లి చూస్తె అప్పటికే జాడీ  అడుగున  చిల్లర పరుచుకొని వుంది. నేను నాజేబులు వెతికి చిల్లరంతా తీసి గుప్పెటతో అందులో పోసాను.అలా వేసే టప్పుడు నా  ఒళ్ళు జలదరించింది.ఇంతలో జయంతిని ఎత్తుకొని నిశ్శబ్దం గా  నాన్నగారు గదిలోకి వచ్చారు.మాఇద్దరి కళ్ళు కలుసు కొన్నాయి. నాన్నగారికి నాకు కలిగిన   ఉద్వేగమే కలిగినట్లుంది .కానీ మే మేవ్వరం ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
{స్టంబుల్ అపాన్నుంచి]   రచయిత  పేరు  తెలియదు. 

1 comment:

SD said...

Stumble upon? It should be named as "Stunned Silence!" Amazing story.