ఇది కృష్ణ వేణి ఇంట్లో వెలిసిన శ్రీ వరలక్ష్మి . కృష్ణ వేణి అట్టహాసంగా అలంకరించిన్ది. నిజం ఆపిల్స్ తో దేవి ఎదుట వరస పేర్చింది ,వాళ్ళ ఇల్లే ఒక దైవ పీఠం
వరలక్ష్మి దేవి
నాకు దత్త పుత్రికలు చాలా మంది వున్నారు. ఒకోసారి వారికి తెలియకుండానే
నేను వారిని దత్త పుత్రికల జాబితాలో చేర్చేసు కొంటాను. మనోజా కుమారి అలాటిదే !చక్కటి కళాభి రుచి వున్న గృహిణి . ఈశుక్రవారం నేను చూసిన వరలక్ష్మి రూపాల అలంకరణ లో ఇది ఎంతో ఆకర్షిం చింది . పూజ గదిలో గోడకి ఒక కర్ర పెట్టి దానికి ప్లాస్టిక్ పూల దండతో ఉయ్యాలా అమర్చింది . దేమునిగట్టుకి దగ్గరగా వచ్చేట్టు పెట్టి చిన్న్ట పీట పెట్టి అమ్మవారిని కూర్చో పెట్టింది . వరలక్ష్మి చేతులు ,కాళ్ళు
విడిగా బజారులో అమ్ముతున్నారు . అవితెచ్చి రూపం తయారు చేసింది . మనం అమ్మకి చీర కట్టాలంటే కొత్త పట్టు చీర తెచ్చి కుచ్చెళ్లు పెట్టి పమిట సవరించడానికి నానా అవస్థ పడతాం . మనోజ మూడు రేవికెల బట్టలు తీసుకొని ఒకటి కాళ్ళకి,ఒకటి జాకెట్ గా,ఒకటి పమిటగా అలంకరించింది ఆభరణాలు ,ఊలు తో జడ వాటిపై రాళ్ళ బిళ్ళలు
,చేతికి చిన్న వంకీ ,ఎంతో ముద్దుగా వుంది . ఏడాది పాపకి సరిపడే వంకీ ఒన్ గ్రామ్ గోల్డ్ ది కొని పెట్టింది .
అచ్చం వరలక్ష్మి దేవి వచ్చి కూర్చుని ఉయ్యాలా ఊగుతోందా ? అనిపిస్తోంది కదూ !అలంకరించింది
పక్కన మళ్ళీ కలశం కూడా పెట్టింది . చిన్నగది,దేమునికి ప్రత్యేకంగావుంది ,పూలతో నేలంతా అలంకరించింది .
కళా దృష్టి వున్నా స్త్రీలకి ఈ పండుగలు ఒక ప్రేరణ నిస్తాయి. వాళ్ళలో వున్నా సృజనాత్మక శక్తి
ఈపర్వ దినాలలో విజృమ్భిస్తున్ది . కన్నుల పండుగగాతీర్చి దిద్దుతారు. అందుకే పండుగలని టయిము లేదని ,ఓపిక లేదని దాటేయ్య కూడ దు . మన వారసులకి అన్దించాలి.
ఈవిడ మాఇంట వెలిసిన మహాలక్ష్మి
కృష్ణ వేణి ఇంట్లో వరలక్ష్మి
ఇది రమ గారింట్లో వరలక్ష్మి
3 comments:
వివిధ రూపాల్లో ఉన్న అమ్మ దర్శనం చేయించారు ।ధన్యవాదాలు। అన్ని అలంకారాలూ బావున్నాయండీ.
అష్టలక్ష్ములనూ చూసినట్లే ఉందండి. చాలా బాగుంది.
mee Opika ki maa abhinaMdanalu.
chakkagaa vraaSaaru. Ammala darSanaM chEyiMchaaru.
Post a Comment