తోటకూర పా ఠో ళీ
రామ చిలుక రె క్కల పచ్చదనంతో లేతగా వున్న తోట కూర కట్టలు తెచ్చి వంటింటి గుమ్మం లో పెట్టింది పని మనిషి ఆ తోటకూర కట్టలు చూడగానే మా అమ్మకి నీరసం వచ్చింది ."అబ్బా! ఈ తోటకూర కట్టలు తెచ్చావుటే! "అన్నది ."ఏదన్నా కూర తెమ్మన్నారు గదండీ!అందుకని తెచ్చానని సంజాయిషీ చెప్పిం ది పని మనిషి .
"తోటకూరతో పప్పో ,పులుసో చెయాలి.కూర చెయ్య డానికి రాదు. పెసర పప్పు వేసి పొడికూర చెయ్యవచ్చనుకో!ఈ కట్టలన్నీ తరిగి కూర చేసినా గుప్పెడు కూర అవదు అదీ సంగతి!అన్నది అమ్మ.
మా నాన్నగారు కిటికీ దగ్గర కుర్చీ వేసుకొని ,కలం గడ్డానికి ఆనించి "ఏం వ్రాయమంటావ్!అని ప్రకృతిని ప్రశ్నిస్తున్నట్లు కూర్చున్నారు .ప్రతి రోజు ఉదయమ్ పూట ఆ కిటికీ దగ్గరే కూర్చుని వ్రాసుకోవడం నాన్న గారికి అలవాటు. కిటికీదగ్గర కుర్చుని చూస్తుంటే బయట ఎంత సందడిగా వుంటుందో! చెట్లు చూడవచ్చు,పక్షుల్ని చూ డవచ్చు, . పూలని చూడవచ్చు, దూరాన వుండే పెద్దపెద్ద కొండల్ని . చూడవచ్చు ,నీలి ఆకాశం పై ముత్యాల మాలలా క్రమ శిక్షణతో అర్ధ చంద్రా కారంగా ఎగిరే తెల్లటి కొంగల్ని చూడవచ్చు ,టైము అయిపోతున్న ఖంగారులో ఆఫీసుకు పరుగెత్తే ఉద్యోగస్తుల్లా పరుగెత్తే వెండి మబ్బుల్ని చూ డవచ్చు.,సైకిళ్ళ మీద ఈల వేసుకొంటూ పోయే కుర్రకారుని చూడవచ్చు, అందరు తననే చూస్తున్నట్లుగా సిగ్గు పడిపోతూ వెళ్ళే కన్నె పిల్లల్ని చూడొచ్చు,వీళ్ళందర్నీ ఖంగారుపెడుతూ హారన్ మోగిస్తూ పరుగెత్తే బస్ లని చూడొచ్చు ,ఏద్రుశ్యమో ఆయన్ని ప్రేరేపించి రచనకు దోహదం చేసేది. బుర్ర ఎంత ఆలోచిస్తున్నా,కళ్ళు ఎంతటి సుందర దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నా చెవులు మాత్రం రకరకాల మాటలు పదిలంగా మనసుకి అన్దిస్తాయి. అలానే తోటకూర గురించి అమ్మ విసుక్కోవడం వినిపించింది కాబోలు :సువర్చలా!ఇవాళ కూర నేను చేస్తానోయ్,అని కెకపెట్టారు.
మా నాన్న గారికి అప్పుడప్పుడూ ప్రేమ పొంగితే అన్నం కూర కలిపి ఎత్తుకెత్తు నెయ్యిపోసి హల్వాలా చేసి మాకు ముద్దలు పెట్టే వారు,చారులో కూడా చారెడు నెయ్యి పోసి పురిశెడు పురిశెడు
పట్టించేవారు. కాని వంట చేస్తాననడం ఇదేమొదటి సారి. అమ్మ నేను మొఖాలు చుసుకొన్నామ్. అప్పుడు అమ్మ ""బావున్ది.ఇంట్లో ఇద్దరు ఆదాళ్ళము వుండగా " అన్నది వంట ఆడ వాళ్ళే వండాలన్నట్లు, గరిట మె డలో కట్టుకు పుట్టినట్లు, నాకప్పటికి పదేళ్ళయినా వంటే నాకు జీవన ధ్యేయం అన్నట్లు అన్నది . మానాన్నగారు కలం కాగితం పక్కన పెట్టి లోపలికి వచ్చి గది మధ్యగా నిలబడి "కూర ఇక్కడే చేస్తా"అన్నారు.మాకు అర్ధం కాలేదు. అలా నిలబడ్డావేం కుంపటి పట్రా !అన్నారు.{ఆరోజుల్లో కుంపటి మీదే వంటలు. }"గదిలో అయితే మసి అవుతుందనా? మీకు మల్లేనా? మీరయతే వంట అంటే ఒకటే హైరానా పడిపోతారు. నేనెంత నీట్ గా చేస్తానో చూపి స్తా. మీరయితే నీళ్ళు పోసుకొని తొక్కుకొంటు ఆచిత చితలో కూ రపెచ్చులు తొక్కుకొంటు ,బొగ్గుమసి ముఖానికి,బట్టలకి పుసుకొంటూ చేస్తారు.నేచూ డు అన్నారు."మీనాన్న మరీ చెపుతారు"అన్నట్లు మా అమ్మ నా వంక చూసింది
నేను కుంపటి తెచ్చి పెట్టాను. కుంపటి వెలిగించడం అదొక పరీక్ష దే ముడి .దయ వల్ల బొగ్గులు పొడిగా వుంటే ఫరవాలేదుకానీ తడి బొగ్గులయితే కుంపటి వెలిగించెసరికే ఓపిక అయిపొతున్ది. చిన్నపుల్ల ముక్కకి గుడ్డ చుట్టి కిరసనాయిల్ లో ముంచి ఉంచేవాళ్ళు అది వెలిగించి కుంపటి కింద పెడితే ఆకిరసనాయిలు వాసన, పొగ కొంచెం సేపు భరించాక కుంపటి అంటు కొంటుంది . అలానే చేసాను "అబ్బో! ఇదేం వాసన,పొగ తియ్యి తియ్యి అన్నారునాన్న. అమ్మ వెలుగుతున్న కుంపటిని అవతలికి తీసుకెళ్ళి పోగ తగ్గాక లోపలి తీసుకు వచ్చిన్ది.నాన్న ఖద్దరు లాల్చీ చేతులు పైకి మడుచుకొంటూ "కత్తిపీట -తోటకూర ఇలాపట్రా !""నేతరిగి ఇవ్వానా?అన్నదిఅమ్మ."నీకేమీ తెలియదులే!కూర తరగడం లోనే వుంటుంది అందము రుచిఅంతా . కూ ర తరగడానికి గణిత శాస్త్రం తెలిసి వుండాలి.కూ ర అంతా సమానం గా తరిగితే సమానం గా ఉడుకుతుంది,లేకపోతే కొన్ని ఆకులు వుడుకుతాయ్ కొన్ని ఆకులువుడకవ్ "అన్నారునాన్న. "తోటకూర వుడకక పోవడ మేమిటి?అందులో బందరు తోటకూర -నిప్పు సెగ తగలగానే వెన్నలా కరిగిపోతున్ది. "అంది అమ్మ.
నిజంగా బందరులో కూరలు,నెయ్యి,స్వీట్లు, ఎంత బాగుంటాయో! కత్తిపీట తెచ్చి అక్కడపెడితే నాన్నగారు ఒకకాలు జాపి,ఒకకాలు మడిచి ,మడిచిన కాలు కింద కత్తిపీట పెట్టి కూర తరగడం ప్రారంభించారు ఎందుకోచ్చినబాద? అన్నట్లు మాఅమ్మ పక్కకు తిరిగి నవ్వుకొంది ,అనుకోన్నంతా అయి నాన్నగారి వేలు సన్నగా గీసుకొని రక్తం వచ్చిన్ది. చాలు నాన్నా! మీరు లేవండి,నే తరిగి ఇస్తా అన్నాను. ఈమాత్రానికే !ఫరవాలేదులే!అని తనే తక్కిన కూర తరిగి, గిన్నె నీళ్ళు ,గరిటె పట్టుకురండి అన్నారు.తెచ్చి పెట్టాము ,గిన్నెలో సగానికి నీళ్ళు పోసి కుంపటి మీదపెట్టి తోటకూర కడిగి పట్టుకు రండి అన్నారు. ఆపనీ అయిన్ది. అమ్మ గిన్నె వంక చూస్తూ "అన్ని నీళ్ళెన్దుకు?అంది సరేగానీ!పెసరపప్పు తీసుకురా నీళ్ళలో నానపెట్టు
అని లేచివెళ్ళి వ్రాసుకోడం మొద లు పెట్టారు వేడి నీళ్ళ ల్లో టీపొడి తెళ్లి నట్లుగా తోటకూర తెళ్ళు తోంది . అమ్మ నాకు సైగ చేసింది నాన్న గారు కూర చూస్తారా? అన్నా. ఆ అంటువచ్చి వుడి కి నట్టుందే అని గిన్నె దింపి పెసర పప్పు రుబ్బడానికి రోలు దగ్గర చేరారు. పత్రం రోట్లోంచి తీసి పప్పంతా పోశారు పత్రం పెడితే అది నిఠారుగా నిలబడింది . పత్రం రోట్లో పెట్టి చుట్టూ పప్పు పొయ్యాలి అంది అమ్మ. సలహాలకు కొదువలేదు అనిఅదంతా పైకి తీసారు. పత్రం పట్టుకొని దంచడము కాదు, రుబ్బటము కాదు అలా డాన్స్ చేయించారు నే రుబ్బుతా నాన్నగారూ అన్నా .నువ్వా!వద్దురా బంగారుతల్లీ! వేళ్ళు నలిగిపోతాయి నీకెందుకు?అన్నారుకానీ పని చేత కాలెదు. ఒక్క సిగరెట్టు కాల్చి అనిదూమం ముట్టించారు అమ్మ రుబ్బటం మొదలెట్టింది .చూసావా!ఎవరేనా పని చేస్తుంటే మీ అమ్మ చూస్తూ వూరుకోలేదు .పదమనిద్దరమ్ పప్పు తోద్దాం నువ్వు గరిట తో తొయ్యి,నేను చేత్తో అన్నారు ముగ్గురం రోటి చుట్టూ చేరి పనిపూర్తి చేసాం .బూర్లె మూకుడు తెచ్చి కుంపటి మీద పెట్టండి ఽమ్మ అలాచేసి నూనె కారియర్ తెచ్చిన్ది. నూనె మూకుట్లో పొయ్య బోతుంటే "ఆఅ ఆగుఆగు అ'అన్నారు. ఏమైందండీ >చీచీ నూనె ఏమిటి?నెయ్యిపట్రా !అమ్మ నెయ్యితెచ్చింది ఉన్నదంతా మూకుట్లో గుమ్మరించారు. అమ్మ ఖంగారు పడిపోయింది నెలకి సరిపడనూనే ! జీడిపప్పులు ఏవీ! అయిపోయాయి అందిఅమ్మ అమ్మలు కొట్లో పట్రారా !అన్నారు జేబులోనుంచి 5రూపాయల నోటు తీసి ఇచ్చారు. అప్పుడు బజారు పని అంటా మనదే! ఎదురుకుండా మూడు పచారీ కొట్లు వున్నాయి. జీడిపప్పు తెమ్మంటే ఆఘ మేఘాల మీద వెళ్లి తెచ్చాను. మరి ,జీడిపప్పంటే అంత ఇష్టం నాన్న ముందు జీడిపప్పులన్నీ వేయించి తీసారు. బంగారు వన్నెలో కులుకు తున్నాయ్ జీదిపప్పులు. తోకాడించే కుక్కపిల్ల లా వాటివంకే చూస్తూ కూచున్నా ,అమ్మ కాసిని పప్పులు కటోరీ లో వేసి ఇచ్చిన్ది. అదేమ రి అమ్మంటే! నేతిలో వేయించిన జీడిపప్పులు నవులుతుంటే ఎంత హాయిగా వుంటుందో! ఇంతలో అమ్మ అయ్యయ్యో!అని అరిచిన్ది. ఏమిటో అనిచూస్తే నాన్నగారు రుబ్బిన పెసరపిండి నేతిలో వేసి, నీళ్ళతో వున్నా తోటకూర అందులో పొయ్యడానికి గిన్నె పట్టుకొని సిధ్ధమయారు. నీళ్ళు తగ్గించాలి అంది అమ్మ తెలుసులే అని పప్పుగరిటె తోతియ్యబోయారు,ఆగండి అనిఅమ్మ చిల్లుల చట్రం తెచ్చి ఇచ్చిన్ది. నీళ్ళు సాంతం ఒడ్చాకుండానే నాన్న తోటకూర మూకుడులో వేసారు అది పప్పుచారులా అయిన్ది. నాన్న ఒక చేత్తో సిగరెట్టు పీలుస్తూ ఒక చేత్తో గరిట తో తిప్పుతున్నారు. మానాన్న ఏపనైనా చెయ్యగలరు అని నేను ఆరాధనతో ఆయన వంకే చూస్తున్నా జాగర్తగా కదుపుతూ వుంటావా? నేను రెండు పేజీలు వ్రాసుకు వస్తా అని నాన్న వరండాలోకి వెళ్ళారు నేను ఒక పావుగంట కదిపా.చెయ్యి నొప్పెట్టింది . ఇక దింప మంటారా?అంది అమ్మ. అరె!ఇంకా వేగన్దే! పా ఠో ళీ అంటే ఏమిటి? కరకర వుండాలి ఇంకా తిప్పు అన్నారు. మరో పావుఘంట అయాక
అమ్మ చెయ్యికూడా నొప్పెట్టాక దింపమని అనుమతి ఇచ్చారు. అప్పటికి అది పోడిపొడి అయింది
అమ్మ దాబాలో రెండు దుప్పట్లు సన్నగా మడిచి పరిచింది పెరుగు ,పచ్చడి,.మంచినీళ్ళు అన్నీ తయార్ పళ్ళాలు పెట్టబోతుంటే నాన్న వచ్చి ఇవెన్దుకు? అన్నారు.భొజనమ్ చెయ్యడానికి అన్నది అమ్మ అరిటాకు పట్రా .నేఅన్నమ్ కలిపిపెడతా అందరం ఒకే ఆకులో తిందాం అన్నారు. కూర లో తోటకూర కనిపించడమే లేదు నేతిలో వేగిన జీడిపప్పులు మాత్రం ధీమాగా కూర్చున్నాయి .ఎప్పుదు తిందామా?అని నే చూస్తున్నా నాన్నగారు పా ఠో ళీ అన్నంలో కలిపి ముద్దచేసి దానిమీద ఒక జీడిపప్పు అంటించి మా ఇద్దరికీ చేతుల్లో పెట్టారు .ఆద్భుతమ్ .భలెగావున్దినాన్నగారు అన్నా! అమ్మ నేతి జాడీ వంక దీనంగా చూస్తోంది .బాగున్దా!ఏమిట నుకోన్నావ్? నాన్న వంట?తినుతిను అని మళ్ళీ మళ్ళీ పెట్టారు మేము బతిమాలితే తను రెండు ముద్దలు తిన్నారు.
ఇక పెరుగులేదు ఏమీ లెదు. తిని అక్కడే ఒరిగిపొయాము. అర్ధరాత్రి అయేసరికి కడుపు ఉబ్బిపోయి ఒకటే నొప్పి. మా అమ్మతో చెపుతే అవునే నాకు నొప్పి గానే వున్ది. అంత నెయ్యిపోసి వండారు నొప్పిరాదూ !పైగా అంతా మనిద్దరికే పెట్టారు . అంది నాన్నగారికి మెళకువ వచ్చి ఏమిటి? నిద్రపోలా!అన్నారు.ఎమినిద్ర !కడుపునొప్పి అని లేచికూర్చుంది నాకు అలానే వున్ది. అయ్యో ఎలా మరి? అంతంత నేయ్యిపోసుకొంటారా? అంటే కోపం మీకు. అంది అమ్మ నాన్నగారు ఇంకెప్పుడు పా ఠో ళీ చెయ్యకండి అన్నాను అ లాగెరాతల్లీ! అని ఇంత ఉప్పు, వాము కలిపి అరచేతిలో నూరి నా నోట్లో పోసారు. . అప్పటి నుంచి నాన్నగారు మళ్ళీ వంట జోలికి రాలెదు.

1 comment:
ఆకేసి, బువ్వేసి, పప్పేసి , నెయ్యేసి నీకో ముద్ద, నాకో ముద్దా..భలే బాగుంది నాన్న గారి వంట..
Post a Comment