Pages

Saturday, March 15, 2014

అమృతమయి మాషీమా అస్తమయం

      అమృతమయి   మాషీ మా   అస్తమయం            
           
              మాషీమా   జేజి   దగ్గరికి వెళ్ళీపోయింది."ఆవథ్ హి   హరషె  నహీ,  నైనన్  నహీ సనెహ్ ,తులసి వహా న జాయియే,కంచన్ బరసే   మేఘ్ " మనం   ఎవరింటీ కైనా   వెడితే   మనల్ని చూడగానె అక్కడి వ్యక్తుల మొఖం లొ ఆనందము,  స్నేహము   కనిపించకపొతే ,అక్కడ బంగారం    వర్షం    కురిసినా  అక్కడికి వెళ్ళవద్దు.  అంటారు తులసేదాసుగారు.
             మా అమ్మ పొయిన తరువాత   నెను కెనడా  వెళ్ళినప్పుడు   మా  కోడలితో  కలిసి  ఆదివారం   సాయి
 సెంటర్కి వెళ్ళాను. మాకోడలు   బాల వికాస్ కి   టీచ్ చెసేది.  అందుకని భజన సమయానికంటే ముందుగా  వెళ్ళాము. షీలా  వాచ్ మెకర్   తల్లి మాషీమా అని చూపించిఉంది మాకోడలు.  ఆవేళ   మాషీమా   ,మా  అమ్మ కట్టుకొనె  తెల్లసిల్క్,విథ్ యెల్లొ బార్దర్   చీర కట్ట్,ఉకొంది వెనకనించి చూసానెమో    మా   అమ్మే   వచ్చి కూర్చుందా?  అనిపించింది. నా   భావం   మషీమాతో    మాట్లాడాక నిజమయింది. ప్రేమైక మూర్తి మాషీమా. ఇంత మొహం చెసుకుని పల్కరిస్తుంది.  దగ్గర   కూర్చోపెట్టుకొని   వీపు నిమురుతూ  మాట్లాడుతుంది. శ్రమలో విలువ,స్నెహంలొ మాధుర్యం,బంధుత్వంలో తీపి అన్నీ తెలుసు.  పల్చటిమొహం ,నవ్వేకళ్ళు ఇక కనిపించవు. కెనడా   జూన్ లో వెళ్దామనుకొంటున్నాను?మాషీమాని కలవాలనె ఆశ .కెనడా  ఎందుకు వెళ్ళాలి?  అనిపిస్తోంది. కానీ  షీలాని పల్కరించాలి. పొద్దున్నె ఈ  వార్త.   కన్నీటి పొరల మధ్య    "ముకుందమాల"  చదివి మాషీమా ఆత్మకి శాంతిని   ప్రార్ధించాను. ఆత్మీయులు ఒక్కొక్కరు  తారల్లా   రాలిపోతుంటే   దారి తప్పిన   బాటసారిలా   అయిపొతుంది మనస్సు.కానీ  మాషీమాలాగ   మనసులో నిలిచిపోయేలా   బతకడం   ఎంత మందికి తెలుసు ? చివరిసారి మాషీమాని కలిసినప్పటి   ఫొటో !   

1 comment:

జ్యోతి said...

నమస్తే అమ్మా,
"ఆత్మీయులు ఒక్కొక్కరు తారల్లా రాలిపోతుంటే దారి తప్పిన బాటసారిలా అయిపొతుంది మనస్సు"
నిజమే, కానీ మీరే అన్నట్టు మనసులో నిలచిపోయేలా బ్రతికిన మీ మాషీమాలాంటివాళ్ళు మరణించీ చిరంజీవులే. దేవుడు మీకు ఈ వియోగాన్ని తట్టుకునే మనఃస్థైర్యాన్ని, మాషీమా గారి ఆత్మకి శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.