Pages

Sunday, April 6, 2014

బ్లాగ్ ని హిందీలో చిట్టా అంటారు

                                  బ్లాగ్  ని హిందీలో    "చిట్టా"   అంటారు. 

                  ఆలోక్ కుమార్   అనేఆయన    మొదటి   బ్లాగ్   హిందీలో వ్రాసారటశీర్షిక "నౌ  దో   గ్యారా .బ్లాగ్  ని   హిందీలో  చిట్టా  అంటారు. (ఇది చూసాక నాకు అనిపించింది,మనం తెలుగులో బ్లాగ్  అనే పదానికి తెలుగు పదం పెట్టుకొందామని  ఎందుకు  అనుకో లేదు?ఇంగ్లీషు పదాన్ని కలికి తురాయిలా ఎందుకు వాడుతున్నాము?నాకు కొన్ని పదాలు తట్టాయి. స్పందన,ఆలోచన,తరంగాలు, ముచ్చట్లు, అనుభూతి,అభివ్యక్తి, ఊసులు ,మలయానిలం .) హిందీలో    టైపు చెయ్యడం    మొదట్లో  
కష్టం   గావుండేది తరువాత హిందీ    "చిట్టాల "సంఖ్య  బాగా పెరిగింది.దీనికి కారణం  "ఇండిక యునికోడ్ " హిందీ టైపింగ్ " "ట్రాన్సి లేషన్ టూల్ " వంటి సౌకర్యాలు పెరగడమే! ఈనాడు    హిందీ చిట్టాలు దాదాపు 50,000దాకా  వున్నాయి. మొదట్లో   చిట్టాలు    వ్యక్తీ గతం   గా వ్రాసేవారు,  ఇతర విషయాల జోలికి పొయెవారుకాదు . తరువాత సినిమాలు,టెక్నిక్ ,సైన్స్   చోటు చేసుకొన్నాయి . 
                     2008 లో "రవీంద్ర ప్రభాత్"  అనే  ఆయన చిట్టాల నుంచి   ఆణి ముత్యాల వంటి వాటిని తీసుకొని   విశ్లేషిస్తూ   పాఠక లోకానికి పరిచయం చేయ సాగారు.పద్యాత్మకంగా,గద్యాత్మకం గా,వుండేవి. చిట్టాలను 
కొన్ని భాగాలుగా  విడదీసి వ్రాసారు . 11 ఖండాలలో వుండేవి. 2009 లో ఆ సంవత్సరం లో వచ్చిన బ్లాగులని  25 భాగాలుగా చేసి  విశ్లేషణ చేసారు 
. ఇవి పాఠక లోకం లో ఉత్సుకత ని రేకెత్తించాయి . 
                                         బ్లాగోత్సవం    చేసుకోన్నారట . బ్లాగ్ రచయితల్ని,ఇతర రచయితల్ని  ఒక రంగస్థలం మీదకు    ఆహ్వానించి ఉత్తమ చిట్టా   రచయితలకి   సన్మానం చెసారు. చిట్టా రచయితలసారస్వత  సన్మానం పేరు" పరికల్పనా సన్మానం" .చిత్త రచయితలూ    విభిన్నభావుకులయినప్పటికి ,అంతర్లీనం గా  "సద్భావం"  వారిని ఏకీకృతమ్  చేస్తుంది . 
                          బ్లాగుల విశ్లేశణా గ్రంధాలు,  వాటిపై విమర్శలు,  చిట్టాల పరిచయ గ్రంధాలు,  చిట్టాల  పేర్లు,రచయితల పేర్ల  గ్రంధాలు హిందీలో ఎన్నో వెలువడ్డాయి.  కధానిక ,నవల ,నాటకం,  వ్యాసం లాగానే   చిట్టా  కూడా   సారస్వతం లో   ఒక స్థానాన్ని సంపాదించుకోవడం    ముదావహం . పాథకుల సంఖ్యా చూస్తె   చిట్టాని  ఎంతగా   చిత్తగిస్తు న్నారో,  ఆదరిస్తున్నారో,అర్ధమవుతుంది . చిట్టా  పనిలేక వ్రాసేదికాదు,   దానికొక స్థాయి,గౌరవం  వున్నాయి. భాషా పరం గా ,భావనా విషయంలో   మన్నికైన  ఎన్నిక రచయితలూ   చూపించాలి ,ఆడుతూ  పాడుతూ పాఠ కులకి  మంచి విషయాలన్దించాలి ,అనేది గుర్తు పెట్టుకోవలసిన   అవుసరం వుంది . మరి మనం కూడా మంచి రచయితలకి   సన్మానాలు   చేసుకొందామా?
  వికిపీడియా  ఆధారం        

1 comment:

కాంత్ said...

log అంటే చిట్టా అవుతుంది గాని, blog అంటే చిట్టా ఎలా అవుతుంది? అదలా పక్కనుంచితే, guru, karma, mantra లాంటి సంస్కృత పదాల్ని ఇంగ్లిష్‌లో యదాతథంగా అలాగే దిగుమతి చేసుకొని వాడుతున్నారు కదా (వాటి అసలు అర్థం చెడకుండా ఉండేందుకు), మరి అలాటప్పుడు మనం తెలుగులో కూడా, blogని బ్లాగు అని తెలుగీకరణ చేసి (కారు, బస్సు, రైలు లాగ) వాడటంలో తప్పేముంది?