Pages

Wednesday, October 16, 2019

నేనెంత

నేనెంత 
మా మాతా మహుల గురించి చెప్పాలి. ఎందుకంటే  నేను మా 
తాత గారింట్లోనే పుట్టాను. మాతాతగారిది నూజివీడు. కృష్ణా జిల్లా.మాతాత గారి సహోదరులు ఏడుగురు.  ఇంటిపేరు శ్రీగిరిరాజు  .ముగ్గురు అప్పచెల్లెళ్ళు. పెద్దామె పెరుగుర్తులేదు,యల్లంరాజు వారి కోడలు. రెండోఆమె సుబ్బమ్మగారు ,చిన్నవయసులోనే విగత భర్త్రుక అయింది. మూడోఆమె. అమ్మన్న అత్థయ్య అనేవారు. రాపాక వారికోడలు.మా తాత గారికి చిన్నవయసులోనే తలితండ్రులు గతించడం వలన  తోబుట్టువులందరి పాలనా పోషణ ఈయన బాధ్యత అయింది. ఇదికాక  మా అమ్మమ్మగారి సోదరికి ఒక అబ్బాయి పుట్టాక భర్త చనిపోయాడు, మా తాత గారు వారిద్దరిని 
తమ ఇంట్లోనే ఉండమని పిలుచుకు వచించారు. ఆమె ఇంటిపేరు నండూరి వారు. అబ్బాయి పేరు నరసిం
హారావు. పెరిగి,పెద్ద అయి వివాహం అయేదాకా మా తాత గారింట్లోనే వున్నారు. పెద్దకొడుకులా ఉండేవారు. ఇక మా తాత గారికి అయిదుగురు అమ్మాయిలు. ఇద్దరు అబ్బాయిలు పెద్ద అమ్మాయి పేరు కమల. ఆమె వూరకరణం వారి కోడలు ,రెండో ఆమెమా అమ్మ. మూడో ఆమె సత్యబాల. ఆమె ధూళిపాళ వారి కోడలు. నాలుగో ఆమె శ్రీమహాలక్ష్మి. ఈమె పండ్రంగి వారికోడలు. ఐదో  ఆమె కుసుమ కుమారి. ఈమె బొడ్డ పాటివారి కోడలు. మా అమ్మ ,అమ్మమ్మ ఒకేసారి నీళ్లు పోసుకున్నారు. మాపిన్ని కుసుమ కుమారి  నాకంటే 3 నెలలు పెద్ద . మా పెద్ద మేనమామ వీరభద్ర రావు. ఈయన భార్య సత్య ప్రసూనాంబ .ఈమె పింగళి వారిఆడబడు చు.రెండో మేనమామ సూర్యనారాయణ ఈయన 
సత్య బాల అక్కగారి పెద్దమ్మాయి అన్నపూర్ణని పెళ్లి చేసుకొన్నాడు. ., 
              నూజివీడులో మేకా రంగయ్యప్పారావు  గారి  హైస్ కూల్ లో మాతాత గారు   ఆంగ్ల భాషా అధ్యాపకులు గా పని చేసే వారు. మాతాత గారిల్లు కోనేటి పేటలో  ఒకసందులోఆ పేటలో పెద్ద కోనేరు  ఉండేది. దాని చుట్టూ ఎత్తైన గట్టు ఉండేది. గట్టు చుట్టూ సందులు .అందుకే ఆపేటకి కోనేటి పేట అనిపేరు వచ్చింది. అక్కడే నేను పుట్టాను. ఆఇంటి గోడ పైన మాలతీ లత .ఉండేది. 

No comments: