Pages

Thursday, October 17, 2019

నేనెంత

   నేనెంత 
              నేను పుట్టేటప్పటికీ  మా నాన్న గారు  కిరసనాయిలు 
కొట్లోనో ,ఎలెక్ట్రికల్ షాపు లోనో పనిచేస్తూ వుండే వారట. నా నామ కారణం తమాషాగా జరిగింది. నేను పుట్టగానే మా అమ్మమ్మ గారింట్లో అందరు నాపేరు జయ  అనిపెడదామని  జయా జయా అనిపిలుస్తున్నారట. ఒకరోజు నాకు అయిదు రోజుల వయస్సు. అకస్మాత్తుగా జబ్బు చేసింది. అన్నీ  బంద్ అయిపోయాయి. కడుపు ఉబ్బి పోయింది. పాలు తాగలేదు. డాక్టర్కి చూపిస్తే ఏమీ లేదు అంతా   బాగానేవుంది అన్నారట. ఆరోజు ఒక పెద్దామె వఛ్చి "ఈమధ్య కాలం లో మీ బంధువు లెవరైనా చనిపోయారా?అని అడిగారట. మా అమ్మమ్మ గారింటి వైపు అలాటి దేమీ జరగ లేదు. అప్పుడు మా అమ్మ చెప్పిందిట. "మా  ఆడపడుచు ఒకామె చనిపోయారు. "అని. "మరింకేమి! ఆమె కి దణ్ణం పెట్టుకోండి "అన్నారట. ఇంట్లో వున్నవాళ్ళందరూ ఆమెకి మ్రొక్కారు. ఆరాత్రి ఆమె మా అమ్మకి కలలో కనపడి "నా పేరు మీఅమ్మాయికి పెట్టువదినా!"అని చెప్పిందట. మా అమ్మ అలాగేనని నమస్కారం చేసిందట. తెల్లవారే సరికి ఇబ్బందులన్నీ తగ్గి. హాయిగా పాలు తాగానట .. మాతాతగారి ఇంటిపేరు రావూరు వారు. వారి ఇంటి ఇలవేల్పు "బాలాత్రిపుర సుందరి  మా అత్తయ్య పేరు జ్ఞాన ప్రసూనాంబ . రావూరు తాతయ్య  గారింట్లో ఎవరు పుట్టినా బాలాత్రిపుర సుందరి పేరు కలిపి పెట్టె వారు .నా నక్షత్రం ప్రకారం "హేమ " అని పెట్టాలి. ఎన్నిపేర్లయ్యాయో. నీ పుట్టగానే మా నాన్న గారు  నాపేరు "సచిత " అని కోరుకున్నారు. ఇవన్నీ కలిపి నామ కరణం సమయంలో "సచిత హేమ బాలాత్రిపుర సుందరీ  జయ జ్ఞాన ప్రసూనాంబ  "  అని పెట్టారు బడిలో చేర్పించినప్పుడు "సచిత జ్ఞాన ప్రసూనాంబ "అని వ్రాసారు.కానీ సచిత అనిపిలిచేవారు. అదే స్థిర పడి  పోయింది. నాన్నగారు బారసాల చేసుకొనేందుకు  నూజివీడు వఛ్చినపుడు రాగానే మా అమ్మమ్మా వాళ్ళు నన్ను చూడనివ్వలేదట, బారసాల అవాలి అన్నారట. మా తాత గారింట్లో వీధి వరండాలో చిన్నగది ఉండేది.అదే పురిటి గ ది మా నాన్న  అటుగావెళ్తూ . చిన్నకిటి కివుంటే తొంగి చూచారట. వంటినిండా కప్పి వుంచారట.ఒక అరికాలు మాత్రం కనిపించిందట."ఎంత మురి సి పో యానో " అదిచూసి అనేవారునాన్నగారు. [సశేషం ]

No comments: