Pages

Friday, October 18, 2019

నేనెంత

  నేనెంత 
                    మా అమ్మ చాలా సన్నగా బలహీనం  గా ఉండేది. మంచి రంగు.  అమాయకత్వం అందులోంచి పుట్టిన
చిరునవ్వు. మూర్తీభచించిన శాంతం . విస్తు పోయే శాంతం . అదే భయాన్ని,నష్టాన్ని ,మౌనాన్ని ప్రసాదించింది. నాకు ఏడాది     దాటీ  దాట కుండానే   అమ్మకి జబ్బు చేసింది. టీ బీ  అన్నారు. ఆరోజుల్లో టీ బి అంటే మందులు తక్కువ .తిరుగు లేని వ్యాధి . 
బందరులో వైద్య సదుపాయం అక్కడవుంటాను  లేదు. రాజమండ్రి లో ఒక కొండ మీద   ఆస్పత్రి కట్టారు. టీ బీ రోగులందరూ అక్కడికి వెళ్లి వైద్యం చేయించు కోవాల్సిందే! తప్ప  దు. కానీ ఎలా? నేను పసిదాన్ని,నాన్నగారికి ఉద్యోగం. అమ్మని ఒక్కదాన్ని ఆస్పత్రిలో ఎలా వదిలేస్తారు? అప్పుడు మా  నాన్నగారి తండ్రి ,ఆయన పేరు సుబ్రహ్మణ్యం గారు. కరిణీకం చేసే వారు. ఆయన నేను వెళ్లి  వుంటాను,అని అమ్మతో వెళ్లారు. అమ్మ కొండమీద  తాతయ్య కింద ఊరులో ,రోజూ తాను సంధ్యా వందనం చేసుకొని ,అన్నం  వండుకొనితి ని,అమ్మకి ఏదైనా మందులు అవీ కావాలంటే కొనుక్కొని ,అమ్మని చూడటానికి కొండెక్కి వెళ్లేవారట. అమ్మ దగ్గర కాసేపు కూర్చుని  చీకటి పడక ముందు ఇంటికి చేరే వారట. 
                         గ్రహ స్థితి వక్రిస్తే దురదృష్టం ఆవరించి విచిత్ర మైన పరిస్థితులు ఒళ్ళో పడతాయి. నాన్నగారు ఒక చోట ,నేను మా బామ్మ దగ్గర అమ్మ ఒక  చో ట . నన్ను మా బామ్మ ముచ్చ్చిలిగుంట  తీసుకువెడుతుంటే  బస్  లో నాకు అయిదారు విరోచనాలయి మా బామ్మ   ఏడుస్తూ  కూర్చుంది టపసిపిల్లని తీసుకెడుతున్నాను,అని వెయ్యి దే ముళ్ళకి  మొక్కుకున్నానే  అని చెప్పేది బామ్మ . బామ్మ నన్ను గుండెల కట్టుకొని , కళ్ళల్లో దాచుకొంది . ఇద్దరమ్మల ప్రేమను కురిపించింది.  మా బామ్మ ను చూ స్తే నాగుండెలు పొంగి పోయేవి. అమ్మ దగ్గరికి వెళ్లేదాన్ని కాను.  ఇలా అమ్మ ఆస్పత్రిలో ఉండగా  ఒక సంఘటన జరిగింది అది ముందు చెపుతాను. సశేషం  4 

No comments: