Pages

Saturday, October 19, 2019

నేనెంత

నేనెంత 
               అమ్మ ఆస్పత్రిలో వుండగా  పెద్ద తుఫాను వచ్చింది. అమ్మ కొండమీద ,తాతయ్య కింద. ఒకరి సమాచారం ఒకరికి తెలియదు.  తాతయ్య ఎలావున్నారో!అని అమ్మ ఖంగా రు పడిపోయింది.  మూడు రోజులు తాతయ్య అమ్మని చూడటానికి  రాలేదు. ఏమయిందో తెలియదు. ఎక్కడన్నా పడిపోయాడో ,దెబ్బలు తలిగాయో,జ్వరం వచ్చిందో ఏమీ తెలియదు. చెప్పేవారెవరూ లేరు. ఆయన చనిపోయాడేమో ?అని భయం వేసి అమ్మ గజగజా వణికిపోయిందిట. సమాచారం తెలుసుకోడానికి దారిలేదు. ఫోన్లు లేవు. ఆయన చనిపోతే నాగతేమిటి? ఇంటికి కబురు ఎలా వెడుతుంది ?అని అమ్మఒకటే బాధ పడిపోయింది. 
                                    ఇటు తాతయ్య తుఫాను వల్ల  ఆట్టే ఇబ్బంది పడలేదు. తుఫాను తగ్గాక అమ్మదగ్గరికి వెడదామనుకొన్నాడట. ఇంతలో భార్యా పిల్లలు అంతా  జ్ఞాపకం వచ్చ్చారు . వాళ్లేమయ్యారో? కోడల్ని ఆస్పత్రి వాళ్ళు చూసుకొంటారు,అని ఇంటికి బయలు దేరాడు. ఆరోజుల్లో తమ కాళ్ళ మీద తాము ఆధార పడే వాళ్ళు. .మామూలుగా కూడా మా తాతయ్య  ఏవూరన్నా వెళ్లాలంటే, రెండు జతల బట్టలు దస్త్రంలా చుట్టి చంకన పెట్టుకొని నడిచి వెళ్లిపోయేవాడు. కానీ,ఇప్పుడో!రాజమండ్రి నుంచి బంద రు వెళ్లాలంటే!ఎంత కష్టం? దారినిండా అడ్డం గా చెట్లు పడిపోయి వున్నాయి.ఖంగారు ముందు ఆయనకీ అవేమీ పట్టలేదు. రెండురోజులు నడిచి  ఇంటికి చేరి, భార్యా, బిడ్డలు క్షేమం గా  వున్నారనిచూసుకొని  ,వేంటనే మళ్ళీ బయలుదేరి కోడలు ఎలాఉందోనని రాజమండ్రి వఛ్చి అప్పుడు అమ్మని చూసారు. అమ్మ ఆయన్ని చూడగానే బార్ మని ఏడ్చిందట
                                తరవాత  అమ్మ ఇంటికి వచ్చింది. మేము కలుసుకున్నాం.  నాన్నగారు ముచ్చ్చిలిగుంటలోనే పెరిగారు.అక్కడ బడిలేదు. పిల్లాడు చదువుకోలేదనే బెంగ తలితండ్రు లకు లేదు. పాడి,పంటలతో ఇల్లు సుభిక్షంగా ఉండేది.ధాన్యం గదుల్లో నింపేవారు. పాలేళ్ళు ,పనివాళ్ళు దేనికీ బెంగలేదు. ఇంటి ఇల్లాళ్లు అలుపు లేకుండా వండి వార్చేవాళ్ళు. పొద్దునలేవగానే ఇంత వెన్నముద్ద,ఊరగాయతో చద్దన్నం తిని కడుపులో చల్ల కదలకుండా అన్నట్లు ఉండేవారట. టిఫిన్లు,కాఫీలు,టీల గోలే లేదు. మా నాన్నగారు హాయిగా పొలం వేగట్లమీద షికార్లు చేసి, రైతులతో కబుర్లు చెప్పి, పల్లెపడుచుల వయ్యారాలు  వీక్షించి ఇంటికి చేరేవారట. మనసులో ఏవో పదాలు చెమ్మ చెక్కలాడుతుండేవి. కొన్నాళ్ళకి వాటిని కాగితంమీద  పెట్టడం ప్రారంభించారు. నాన్నగారు అతి చిన్న అక్షరాలూ ఆవగింజంత ప్రమాణం లో వ్రాసేవారు.వాళ్ళ అన్నగారి దగ్గర వ్రాయను చదవను నేర్చారు. ఒకసారి నాన్నగారి కవిత్వం తాతయ్య చేతి లో పడింది. "ఆయన ఉగ్రుడై "ఎందుకురా ఈ కవిత్వం?  కూటికా?గుడ్డకా?అని కాగితాలన్నీ చింపి వీధిలో విసిరేశారట. అప్పుడు మా నాన్న గారికి అయ్యో!చదువుకోలేదు! అని బాధ వచ్చింది. చెట్టెక్కి కూర్చున్నారట. మా చిన్న పెదనాన్న వెళ్లి "దిగులు పడకుము ఆంధ్రుడా!  దిగుము చెట్టు "అనిచెప్పి ఇంటికి తీసుకువఛ్చి ధైర్యం కలిగించారట. బడిలో చదువుకోవాలంటే బంద రు వెళ్ళాలి . వెళ్లాలంటే డబ్బు కావాలి.అప్పటికే మా తాతగారి ఆస్తి అంతా  హారతి కర్పూరంలా  హరించుకు పోయింది. ఆకధ చెప్పాలంటే   తాత గారి కుటుంబం గురించి చెప్పాలి .ఈసారి వివరిస్తా .    సశేషం      5       

No comments: