Pages

Sunday, October 20, 2019

నేనెంత

నేనెంత 
                  మాతాత గారిది ముచ్చ్చిలిగుంట గ్రామం. మాతాత గారు అయిదు ఊళ్ళ కరిణీకం చేసేవారు. ఊళ్లన్నీ గుర్రం మీద తిరిగేవారట. సమిష్టి కుటుంబం. అప్పుడు అందరూ అలానే కలిసి వుండే వారు. అన్నదమ్ములు నలుగురు. మతి స్థిమితం లేని ఒక చెల్లెలు ఉండేదని   విన్నాను. పెద్దాయన పేర్రాజుగారు. ఆయన రాముడు, తమ్ముళ్ళందరూ లక్ష్మణ స్వాములు. మా తాతయ్య ఆయనకీ చే రువుగా   ఉండేవారు. పేర్రాజుగారికి సంతానం లేదు. శివాలయంలో గూడూరులో శివాలయం కట్టించి ధర్మ కర్తలుగా ఉండేవారు.శివుడికి కళ్యాణం చేయిస్తే వీధుల్లో విస్తళ్ళు వేసి భోజనాలు పెట్టేవారు. ఆచివరి నుంచి ఈ చివరిదాకా నెయ్యి  కాలువలు కట్టేది. ఒ డుగులు, పెళ్లిళ్లు చేయించేవారు. అతిథులకు ,అభ్యాగతులకి లోటు లేదు. వూరిలో రామాలయం కట్టించారు. అన్ని వ్యవహారాలూ మా తాతయ్య చూసేవారు. మా టాటా గారికి తొమ్మండుగురు సంతానం. పెద్ద పెదనాన్న పేరు గోపాలరావుగారు. ఆయన భార్య చిట్టూరి వారి ఆడబడుచు. రెండో ఆయన పేరు రామ్మూర్తి గారు. మూడో ఆయన మా  నాన్నగారు,సత్యనారాయణరావు ,నాలుగో ఆయన నరసింహారావు అమ్మాయిలు పెద్దామె గురుజాడ వారి కోడలుబాలాత్రిపురసుందరి  .రెండో ఆమె జ్ఞాన ప్రసూనాంబ, మూడోఆమె చిట్టి అనేవారు,తుమ్మలపల్లి వారి కోడలు ఈమె భర్త మా అమ్మకి బాబాయి అవుతారు. కానీ దత్తు వెళ్లారు నాలుగో ఆమె భారతి ,ఈమె సింగరాజు వారికోడలు 
ఐదో  ఆమె సీత కలవగుంట వారి కోడలు . 
   మా తాత  గారు  ఆడ  పి ల్ల లందరికి  పెళ్లిళ్లు చేశారు .  పెద్దనాన్నగారు నిత్యా జీవితానికి సరిపడా అక్షర జ్ఞానం సంపాదించారు. చిన్న పెదనాన్నగారు. మంచి వ్యవహార్థ. "మోకాలికి బట్ట తలకి ,ముడివేయ గలరు. " "పీటముడులు విడదీయ  గలరు. "వూరిలోనూ ,కుటుంబం లోనూ ఎంత జటిల మైన సమస్యలు వఛ్చి నా సునాయాసంగా పరిష్కారం చేసేవారు. పరపతి సంపాయించారు. ఇక మా నాన్న గారి దగ్గరికి వచ్చ్చేసరికి హుళక్కి. మా తాతయ్య అన్నగారి ఆనందం కోసం, పేరుకోసం చేసి న ఖర్చులన్నిటికి  తాతగారు పూచీపడి సంతకాలు చేశారు. పేటంత  భూమి చేటంత అయింది. మా తాత గారి వదిన విధవ రాలు ఉండేది. ఆమెకు రెండెకరాల భూమి ఉండేది. సంతానం లేదు. మా నాన్నగారు బందరులో చదువుకోడానికి ఆమె సహాయం చేసింది. అంతేకాదు బందరులో వుంది నాన్న గారికి వండిపెట్టీది. ఆమె వచ్ఛేముందు చెప్పింది."ఒరేయ్ !సత్యం !నీకొక్కడికి మాత్రం వండిపెట్టగలను. వాళ్ళని, వీళ్ళని తీసుకొచ్చ్చి వం."డి వడ్డించ మంటే నా వల్లకాదు.  మూటా ముల్లె కట్టుకొని చక్కాపోతా. ఆతరవాత నీ ఇష్టం "అని .ఆమె పొదుపుగా సంసారం నడిపింది  వంకాయ పొయ్యి మీద అన్నం  వండుతూ ,పొయ్యిలో ఒక గుండు వంకాయ  పడేసి ,అది కాలాక తీసి వలిచి ,అందులో ఇంత ఉప్పు కారం వేసి  బజ్జీ చేసి అన్నం పెట్టేది.నాన్నగారు బి ఏ  చదివారు. అప్పటికే తెలుగులో కవిత్వం వ్రాయడం ప్రారంభించారు.కుచేలో పాఖ్యానం పద్యాలలో వ్రాసారు అది ఎక్కడో పోయింది. 
       కడిపెడు బిడ్డలం కనియు,కర్మ వశం బిటు లుండ చేత ,ఆ 
      బుడుతల పెట్టిపోతలకు పుట్టవు చారెడు నూక గింజలున్ ,తా పడెడు అవస్థలం తెలుప వచ్ఛే

 కుచేలుడు సిగ్గు చేత నన్నడు
గడు ,వానికిత్తు 
సకల ఐశ్వర్య సిరి సంపదల్ అలా ఎదో వుంది. ఇంకోపద్యం 
భూసుర వర్యు డీతఁడు నేచేసిన పూర్వ పుణ్యమున చేకూరే నాకొక బాల్య మిత్రు డై  , సుపేశ కరముల పాద మొత్తగా ,దాసుడా నుండి నేనిచట, దాసివి నీవును రమ్ము రుక్మిణీ !
   ఆకావ్యం అంతా  జాగ్రత్త పెడితే ఎంత బాగుండేదో! 
          గేయాలు వ్రాసారు.
              కొత్థ చీరా కట్టి కుచ్ఛే ళ్లు జిమ్మి 
              కొత్థ రై కా తొడిగి బొత్తాము పెట్టి 
              కొప్పులో పూలెట్టి  కూకుంట బావా !
               వఛ్చి పో   బావయ్య ,వచ్చ్చిపోవయ్యా 
             వఛ్చి పోతుంటేను మఛ్చికౌతుంది 
              మఛ్చి  కైనా మీద మనసు కలిసెను
               స శే షం   6 
                   
                                                     
              

No comments: