Pages

Thursday, October 24, 2019

నేనెంత

నేనెంత 
       కంపోజ్ చేసిన మెటర్ని కాలం సైజులో కుదింఛి మూడుకాలంస్ ఒక పేజీగా ఒక మోల్డ్లో పెట్టి అలాటి పేజీలు ఎనిమిది తయారు చేసి,నాలుగు పేజీలు  ముందు వెనకా ప్రింట్ అయేలా చేసిమిషను చేత్తోనే తిప్పేవారు. పెద్ద రోలర్ లాటిది తిరుగుతుంటే  దానిని మిషన్ లో పెట్టేవారు. ,ఆఫారమ్స్ బయటికి వస్తుంటే ఎంత చిత్రం గా ఉండేదో  అనుభ వజ్ను లైన కంపోజిటర్స్  పర్య వీక్షణ చేస్తూ ఉండేవారు. ముందు  ప్రూఫులు పొడుగాటి  కాగితాలపై తయారు చేసి ఇచ్ఛేవారు. ఆ మే తారు వ్రాసిన వారయితే ప్రూఫులు దిద్దడం తేలిక. బయట వారు వ్రాసినవి,చాలా జాగ్రత్తగా దిద్దాలి. ప్రూఫ్ రీడింగు అదీ ఒక కళే !అదొక భాష. చాలా ఓర్పుఉండాలి . ప్రూఫులు దిద్దడానికి ఇంటికి పట్టుకొచ్చ్చేవారు.  కూర్చో పెట్టి నాన్నగారు దిద్ది ఇచ్ఛేవారు. అప్పుడు నీకూడా కొంచెం నేర్చుకున్నా. 
                              కృష్ణా పత్రిక  వరండాలోంచి  మెట్లు ఉండేవి. పైన ఒక  గది .గాలి వెల్తురు,కిటికీలోంచి చూస్తేకింద పూల చెట్లు శిల్పాలు. కృష్ణాపత్రిక ఆస్థాన చిత్ర కారుడు తోట వెంకటేశ్వర రావు గారు బొమ్మలు వస్తూవుండేవారు.మెట్ల పక్కనేఒక పూల తీగ ఉండేది. దానికి "బాతుపూలు పూసేవి. అంటే కొమ్మచివర పువ్వు పూసేది.దానీరెక్కల పై మచ్చ్చలుండేవి .రంగు డార్క్ వైలెట్ ,దానిపై పసుపు చుక్కలు ,ఎందుకో నాకా  పువ్వులు  విచిత్రంగా ఉండేవి.ఆఫీసులో కాగితపు సంచీతీసుకొని దాంట్లో పూలు కోసుకు తెచ్చుకొనేదాన్ని. 
                                అకౌంటెంట్ మల్లినాథ సూరి గారికి నత్తి ఉండేది. అంచేతనో ఏమోబిడియ   పడుతూ ఎవరితో కలిసేవారు కాదు. మానాన్న   గారు ఆయనికి ధైర్యం చెప్పి ,ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళ్లేవారు. హాస్య ప్రియుడు. బహు సంతానం,చాలీ చాలని జీతాలు. అయినా ఛలోక్తులు విసురుతూ  ఉండేవారు.  మా నాన్నగారు కృష్ణా పత్రికలో వారం వారం వ్రాసే హాస్య వ్యంగ రచన "వడగళ్ళకు ఆయనే హీరో!
ఆయనేదో ఒక చేనుకు విసిరితే ఆదిపుచ్చూకు నాన్నగారు సాగదీసి,చిలవలు  పలవలు తీసి వ్రాసేవారు. ఆవ్యాసాలు నాన్నగారికి,కృష్ణా పత్రికకు కూడా మంచి పేరు తెచ్చ్చిపెట్టాయి. కృష్ణా పత్రిక శుక్ర వారం సాయంత్రం విడుదల అయేది. కిల్లె కోట్లలో  ఆయా పేజీ విప్పి తాడుపై క్లిప్పులు పెట్టి వ్రేలాడదీసేవారు  . కొనుగోలు దారులు,వచ్ఛేపోయెజనం కొననక్కర లేకుండా నిలబడి చదువుకునేవారు.        

1 comment:

FrankTalker said...

"ఆవిర్భవ " ఆరవ సంచిక .....
క్రియేటివిటీ దొంగలుగా వెబ్ చానల్స్ ....
పత్రిక నీతి పదవి కొరకు తాకట్టు పెట్టిన కలం క్రూరులు
సర్దార్ భారతం మిగల్చని నెహ్రూ కుటుంబం ....
వంటి ఎన్నో ఆసక్తికర అంశాలతో వెలువడిన ఈ ఆరవ సంచికను తప్పక చదవండి ...చదివించండి ....
https://www.readwhere.com/read/2420733/Avirbhava-sixth-Edition-November-16th-2019/Avirbhava-sixth-Edition-November-16th-2019