Pages

Wednesday, August 5, 2020

నేనెంత

నేనెంత 
         ఒకరోజు నాన్నగారు అలవాటు ప్రకారం  కృష్ణా పత్రిక ఆఫీసుకువెళ్లారు . సాయంత్రం అయింది. నీరెండలు సాగుతున్నాయి. కృష్ణా పత్రిక సంపాదకులు శ్రీ ముట్నూరు కృష్ణారావుగారు ఆఫీసులో వున్నా చిన్న తోటలో   పచార్లు చేసే సమయం .  నాన్నగారు రోజూ లాగానే నిశ్శబ్దంగా ఆయన వెనకే నడుస్తూ, ఆయన ఆగితే ఆగుతూ నడుస్తున్నారు. ఆతోటలో చక్కటి రాతి శిల్పాలు ఉండేవి. సీతాకోక చిలుకలు తిరుగుతూ ఉండేవి. కొత్తగా పూలు వికసిస్తూ ఉండేవి .రోజూ చూస్తున్నా ఒకొరోజు వాటిలో ఎదో కొత్తదనం ఆయనకీ కనిపించేదేమో!అలా నిలబడి కొంచెం సేపు చూసి!మళ్ళీ తిరిగేవారు, ఆరోజూ అలాగే ఓ అరగంట గడిచింది, నడుస్తున్న వారాల్లా ఆయన గిరుక్కున వెనక్కి తిరిగి“రేపటినుంచి రండి“ అన్నారట  .!  అంతే   మానాన్నగారు మబ్బుల్లో తేలిపోయారట.ఏమిచెయ్య అంటారు?ఎన్నింటికి రానూ?ఎంత జీతం ఇస్తారు అని ఏమీ అడగలేదుట. అలాగే అని నమస్కారం చేసి ఆఘ మేఘాల మీద ఇంటికి వఛ్చి  మా అమ్మతో “నా జన్మ తరించింది, నా జన్మ ధన్యమైంది. నాకలనిజమైంది .అని సంతోషం తో  ఉక్కిరి బిక్కిరిఅయిపోయి చెప్పారట. 
                   మర్నాటినుంచి ఆఫీసుకు రోజూ వెళ్లడం ప్రారంభించారు. ఏముహూర్తాన ప్రారం భించారో గానీ కృష్ణాపత్రిక ఆయన జీవితం అయిపొయింది. 
              బందరుకి ఒక ప్రత్యేకత వుంది, ఒక హోదావుంది,లలితా కళా భూయిష్ట మైన ఒక వాతావరణం వుంది,స్వాతంత్ర సమర పోరాటానికి సిధ్దముగా వున్నప్రజా సమూహం వుంది. 


No comments: