[2] పేరు
'ఏమిటీ"అన్నాను నేను.దాక్షాయని అనె పేరువిన్నా గానీ నీ పేరు దాక్షవని
ఏమో?అన్నాను కాదండీ! ద్రాక్షావళి అంది."ళ,ళ"అని రెండుసార్లు చెప్పింది.
మేము చిన్నప్పుడు తెలుగువ్యాసం వ్రాసేటప్పుడు,దీపావళి వ్యాసం వ్రాస్తూ
"దీప"అంటే దీపము,"వళి"అంటే వరుస సమూహము అనివ్రాసేవాళ్ళము.ద్రాక్షా
వళి అంటే ద్రాక్షల వరుస లేక సమూహము కాబోలు అని గుణించుకొన్నాను.
ఆ అమ్మాయి పేరు "ద్రాక్ష గుత్తి" అన్నమాట. పేరు చాలా పొయిటిక్ గా అని
పించింది.నాకు నచ్చింది.పేరులో ఏముంది అంటారు గానీ అంతా పేరులోనేవుంది.
ఒకగొప్ప వ్యక్తి వున్నారనుకోండి, ఆయన గతించినా ఆయన పేరు చెప్పగానే
ఆయనతో పరిచయ మున్న వారికి ఆయనరూపం,ఆయన వ్యక్తిత్వముఒక్కసారి కళ్ళముందు నిలుస్తాయి.ఓహో!ఆయనా! అంటారు.కొందరిని చూడకుండానే పేరు విని
స్నెహం చెయ్య బుధ్ధి పుడుతుంది. కొన్ని పేర్లు ఎంతో బాగుండి మనకీ ఇ పేరుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. నిజమే! ఎవరో అన్నాట్లు కొనాపెట్టని పేరుకూడా ఒక్కటే పెట్టుకోవడమేమిటి? అనిపిస్తుంది.కనీ ఎక్కువ పేర్లతో తంటాలుకదా?
ఇప్పుడు పిల్లలకి పేర్లు చాలా వెతికివెతికి పెడుతున్నారు. వీని భావమేమి వెంకటేశా! దీనిభావమేమి తిరుమలేశాఆ!అని శబ్దార్ధ చంద్రిక తిరగెయ్యాల్సి వస్తూంది.ఆ అమ్మాయితో నీపేరు చాలా కొత్తగా వుందే,ఇంతవరకు నేవినలేదు,అన్నాను.ఆ అమ్మాయి నవ్వి భైబిల్ లొఫలానా చోట వుంది,అని చెప్పింది.
నువ్వు చదువుకొన్నావా?అంటే పదిదాకా చదివానడీ!అంది.అందుకే పెరు గురించి చెప్పగలిగింది.మొన్నఒకరు కవలపిల్లలు పుడితే,'త్రుప్తి,త్రుష్ణాఅనిపేర్లు పెట్టారు.మొన్న ఒక పాపకి"వేదయుక్తి" అని పేరుపెట్టారు.కొందరి ఇళ్ళల్లో అయిదారుగురు "సుబ్బయ్యలూఅయిదారుగురు"వెంకయ్యలు"వుంటారు.అవి వాళ్ళ ఇంటి ఇలవేల్పుల పేరు అయివుంటుంది.వాళ్ళని చినసుబ్బయ్య,నల్ల సుబ్బయ్య,పొడుగు సుబ్బడూని పిలుస్తూ వుంటారు. మనకి పరిచయమయిన ప్రతి వ్యక్తి పేరు గుర్తుంచుకోవడం ఒక గొప్ప అద్రుష్టం. కొందరికి ప్రెసిడెంట్ మేనకోడలిపేరుకూడా గుర్తుపెట్టుకు చెపుతారు.మనిషిని పేరుతో పిలిస్తే వచ్చే స్పందన చుట్టరికంతో,ముద్దుపెరుతో పిలిస్తేరాదు. పేరుతో పిలిస్తే ఒక ఆప్యాయత వస్తుంది.మనపేరుగుర్తుంచుకొన్నారనే ఆనందం వుంటుంది.మనకేచెపుతున్నారనే గట్టి నమ్మకం వుంటుంది. అపేర్లు అందంగా వుంటే మళ్ళి మళ్ళీ పిలవాలని అనిపిస్తుంది.
14 comments:
ammA - monnI madhyana maa aaphIsulO oka telugu jaMTaki kavalalu puDitE, peTTina pErlu ivI - "trushNav" "bhAshNav". inkEm anAlO nAkayitE teliyalEdu.
alAgE inkOkaLlu vALla pApaki peTTina pEru "vidrANi". inkO pApa pEru "gArjani". inkO abbAyi pEru "sArushyAnka". ilAga unnAyamDi ...
హహ..బాగా రాసారు.
మా కాలనీలో ఉండే ఒక పాప పేరు 'ద్రష్ట ', అర్థం తెలీదు కానీ ఆ పేరు తో పిలవాలంటే కొద్దిగా కష్టంగా ఉండేది.
నా స్నేహితుల పిల్లల పేర్లు: రిద్ధి, రితుల్, రుజుల, కేయూర (గోంగూర లాగా అన్నమాట), రిషిత్ (పిలిచే విధానం మాత్రం 'రిషిట్' అట). ఏవేవో డిక్షనరీ అర్ధాలు చెప్పారు కానీ కొన్ని వినటానికి, మరి కొన్ని అనటానికి ఏదోలా ఉన్నాయి. ప్రస్తుతం రకారంతో మొదలయ్యే వాటికి ఎక్కువ డిమాండున్నట్లుంది. రాక్షస్, రంబోళ, రూపాయి, రంజు, వగైరా కూడ వినిపిస్తాయేమో త్వరలో.
నా స్నేహితురాలి కొడుకు పేరు "వృషణ్", కూతురి పేరు "కష్వి". ఆ పేర్ల అర్థాలు అడిగే సాహసం నేను చేయలేకపోయా... అలానే ఆ పేర్లు పెట్టి పిలిచే సాహసం అంతకన్నా చేయలేకపోయా...
హ హ హ హ వెరైటీ గా వున్నాయి పయిన చెప్పిన పేర్లన్నీ
అందరూ నా పేరుని పాతకాలం పేరు అని వెక్కిరిస్తారు :(
మరి ఈ కాలం పేర్లకి అసలు అర్ధమే లేదు ఏం చెయ్యాలో ??
@Laxmi,
vRuShaN...
ha ha ha...Sorry Im rolling on the floor laughing...
Quite a romantic name :P
Seriously, people who name their children like that should be dragged into the street and shot.
మాకు తెలిసిన వాళ్ల అమ్మాయి పేరు 'శతఘ్ని' :-)
- Shiv.
సరే, నేనూ కొన్ని అర్థం లేని వింత పేర్లు చెప్తా చూడండి!
మా ఎదురింటి వాళ్లకు పాప పుట్టింది.. దాని పేరు సాన్వి. వాళ్ళ అక్క పేరు ఆష్క! మరొకడి పేరు రిషిక్.
శ్రీక,(కేక లాగా),యదు, షీనా, హీనా ఇద్దరూ అక్కచెల్లెళ్ళు.(మరీ హీనంగా లేదూ ఈ పేరు)
నిన్ననే ఇంకో బుడ్డోడు పుట్టాడు...వాడి పేరు నమ్మండి..నమ్మకపొండి.."స్వయం"! వాళ్ల నాన్న వైపు చూసి అందరూ అదోలా నవ్వుతున్నా ఆ పేరు వెనక ఐరనీ వాళ్లకు తట్టడం లేదు.
ఎవరికీ లేని పేరు ఉండాలి, మోడరన్ గా ఉండాలి..ఇవీ ఇవాళ పేర్లు పెట్టేటపుడు చూసే విషయాలు.
లక్ష్మి గారు
మీరు చెప్పిన బాబు పేరు మరీ ఘోరంగా ఉంది. బుద్ధి లేకపోతే సరి తల్లి దండ్రులకి!
శివరంజని...
శతఘ్ని నా...! ఓరి దేవుడా!
నేను విన్న వింత పేర్లు సాన్వి, కానుక, దీపిత, అధర్వణ్
అమ్మా...చాలా బాగా చెప్పారు.పేరులో చాలానే వుంటుంది.
కామెంట్లు అదిరాయి.కంటి చూపులతో చంపేసినట్టు...పేర్లు చెప్పి నవ్వించేస్తున్నారు ఇక్కడ జనాలు :)
వృషణ్ .. ఆ పిల్లోడు పెద్దయ్యాక అమ్మా నాన్నల్ని వృద్ధాశ్రమంలో చేర్చెయ్యటం ఖాయం. ఈ పేరు వింటే గుర్తుచ్చింది, నా సన్నిహితుల అమ్మాయిది - మరో రకారం పేరు - రిషభ! సరిగమల్లో రిషభం పేరట, నాకైతే వృషభం ధ్వనించింది. వేరేవాడొకడు తన పాపకి 'మహిషి' అని పేరెడదామని ఉవ్విళ్లూరాడు. మహిషి అంటే 'రాణి' అని వాళ్లావిడ ఎక్కడో చదివి చెప్పిందట (చిన్నప్పుడు చందమామల్లో 'పట్టపు మహిషి' అని చదివింది గుర్తేమో ఆమెకి). అసలర్ధం నేను చెబితే అదిరిపోయి 'సహస్ర' అనే పేరెట్టుకున్నాడు.
నేను విన్నవాటిలో కెవ్వుమనిపించేది ఒకటి ఉంది, ఓ ఉత్తరాది కుటుంబం వాళ్ల క్రియేటివిటీ, వింటేనే కంపుకొట్టేది - 'విరేచన్'.
మా అమ్మాయికి పెట్టాలనుకొన్న పేరును చెపితే మా అమ్మ అదేంట్రా అందరూ కొత్త కొత్త పేర్లు పెట్టుకొంటూంటే నువ్వలాంటి పాత పేరు పేరు పెడుతున్నావు అంది అమాయకంగా. అలా ఎందుకన్నదో ఇప్పటికీ నాకు మిస్టరీయే. బహుసా సెటైర్ కావచ్చేమో.
ఇంతకీ మా అమ్మాయి పేరు "అపరాజిత"
బొల్లోజు బాబా
అబ్రకదబ్ర,
....(పేరు రాసే సాహసం కూడా లేదు నాకు) పేరు గల కుర్రాడు పెద్దయ్యాక తల్లి దండ్రుల్ని వృద్ధాశ్రమంలో చేర్చెయ్యడం ఖాయం..."
ఉత్తరాది కుటుంబం క్రియేటివిటీ....! మీ కామెంట్ కడుపు చెక్కలయ్యేలా నవ్వించింది.
బాబా గారు,
మీ అమ్మాయి పేరు ఎవర్ గ్రీన్ గా ఉంది. మాకు తెలిసిన వాళ్ళు పాపకి "రసన" అని పెట్టారు. రసన అంటే నాలుక అని అర్థం నేను చెప్పేసరికి లేటైపోయింది. బర్త్ సర్టిఫికెట్ కూడా వచ్చేసింది.
ఏంటేంటి...పేరెట్టి చంపేస్తాను అంటాడేమో ఇంక మన బాలయ్య..
మా ఇంట్లో అందరికి సూర్యనారాయణ, ప్రభాకర్, శ్రీనివాస్ ఇలా చక్కటి పేర్లు ఉన్నా మమ్మల్ని మా ఊళ్ళో అందరూ పెద్ద పప్పు(మా నాన్నగారు), చిన్న పప్పు(మా అన్నయ్య), బుల్లి పప్పు(నేను)అనే పిలిచేవారు...ఇప్పుడు మా అన్న కొడుకుల్ని నా కొడుకుని కూడా కాలేజ్ లో అంతే..ఇప్పటికీ నన్ను ఆఫీసులో పప్పు అనే పిలుస్తారు...అదే నామ వచకం...అదే సర్వనామం అయిపొయింది...
Post a Comment